బిజినెస్

మంచి సేవలకు పన్ను తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ప్రజలు మంచి సేవలు కావాలనుకుంటే పన్ను (టోల్) చెల్లించాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవని, అందువల్ల టోల్ వ్యవస్థ కొనసాగుతుందని ఆయన తెలిపారు. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల కోసం డిమాండ్లపై లోక్‌సభలో జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయం తెలిపారు. ప్రభుత్వం గత అయిదేళ్లలో 40వేల కిలో మీటర్ల హైవేలను నిర్మించిందని ఆయన వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో టోల్ వసూలు చేయడం పట్ల కొంత మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా, టోల్ చెల్లించగలిగే సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లోనే దాన్ని వసూలు చేయడం జరుగుతోందని, అలా వచ్చిన డబ్బును గ్రామీణ, కొండ ప్రాంతాలలో రహదారులను నిర్మించడానికి ఉపయోగించడం జరుగుతోందని గడ్కరీ అన్నారు. ‘టోల్ వ్యవస్థ ఎప్పుడూ అంతం కాదు. టోల్ రేట్లు తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. నా ఆలోచనలో నుంచి వచ్చిందే టోల్’ అని గడ్కరీ అన్నారు. ‘మీకు మంచి సేవలు కావాలనుకుంటే, మీరు దానికి (పన్ను) చెల్లించాల్సిందే. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు..’’ అని మంత్రి నొక్కిచెప్పారు. రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుల్లో భూసేకరణయే పెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు పరిష్కారంతో ముందుకు రావాలని, దీనికో మార్గాన్ని కనుక్కోవడానికి సహకరించాలని ఆయన కోరారు. తన మంత్రిత్వ శాఖ 80 శాతం భూసేకరణ పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోవడం లేదని, ఈ సూత్రాన్ని చాలా గట్టిగా పాటించడం జరుగుతోందని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్, బిహార్‌లలో భూసేకరణ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని ఆయన వెల్లడించారు.
2014లో తాను ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన సమయంలో రూ. 3.85 లక్షల కోట్ల విలువ కలిగిన 403 ప్రాజెక్టులు మూతపడ్డాయని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, మోదీ ప్రభుత్వం అయిదేళ్లలో ఈ మూతపడిన ప్రాజెక్టుల పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రూ. మూడు లక్షల కోట్ల విలువ గల నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏలను) కాపాడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి ముంబయి వరకు కొత్తగా ఒక గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించడానికి కసరత్తు చేస్తోందని మంత్రి సభకు తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే రాజస్థాన్, గుజరాత్, మహారాష్టల్రోని అత్యంత వెనుకబడిన, గిరిజన ప్రాంతాల మీదుగా వెళ్తుందని ఆయన వివరించారు. దీనివల్ల భూసేకరణ వ్యయంలో రూ. 16వేల కోట్లు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.