బిజినెస్

రూ.1.02 లక్షల కోట్లు తగ్గిన వాణిజ్య బ్యాంకుల మొండి రుణ బకాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో వాణిజ్య బ్యాంకుల మొండి రుణ బకాయిలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. గతంలో రూ. 9.34 లక్షల కోట్లు ఉన్న ఈ బకాయిల్లో గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1.02 లక్షల కోట్ల మేర తగ్గాయని ఆమె వివరించారు. ప్రత్యేకించి బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) గుర్తింపునకు ‘4ఆర్’ల వ్యూహం అమలు చేస్తూ పారదర్శకంగా, నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. రుణ బకాయిలకు సరిపడా సంబంధిత ఆస్తులు రికవరీ చేయడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూల ధనాన్ని పెంచి ఆర్ధికంగా బలోపేతం చేయడం, మరిన్ని సంస్కరణలను చేపట్టడం వంటి చర్యలను పటిష్టవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా రుణ మంజూర్ల సంప్రదాయంలో సైతం మార్పులు తీసుకువచ్చామని, ఇందులో భాగంగా దివాళా, బ్యాంకుల మోసగింపుల నియంత్ర చట్టం (ఐబీసీ)ని కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రుణ దాత,గ్రహీత మధ్య ఉండాల్సిన వౌలిక నిబంధనల్లో సైతం మార్పులు చేసినట్టు తెలిపారు. రుణాలు చెల్లించలేక చతికిలపడిన కంపెనీల పునరుద్ధరణ మార్గాలను పరిశీలించడం, మార్కెట్ల నుంచి నిధుల సమీకరించడం, ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగవేసిన కంపెనీలను పునరుద్థరణ పథకం నుంచి డీబార్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని నిర్మల వివరించారు. అలాగే రిజర్వు బ్యాంకు అంతర్జాతీయ కార్యకలాపాల గణాంకాల మేరకు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్‌సీబీలు) నిరర్థక ఆస్తులు 2018 మార్చి 31 నాటికి రూ. 10,36.187 కోట్ల భారీ స్థాయికి చేరగా ప్రస్తుతం రూ. 1,02,562 కోట్లు తగ్గి మొత్తం రూ. 9,33,625 కోట్లకు చేరిందని ఆమె సభకు వివరించారు. 2018-19 సంవత్సరంలో రూ. లక్ష ఆపైన తీసుకున్న రుణాలకు సంబంధించి బ్యాంకులను మోసగించిన కేసులు అత్యధికంగా 374 కేసులు ఐసీఐసీఐ బ్యాంకు తనపున నమోదయ్యాయన్నారు. అలాగే హెచ్‌డీఎఫ్ బ్యాంకు (273), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (273), ఆక్సిస్ బ్యాంకు (195), అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (190) వంతున మోసగించిన కేసులు చోటుచేసుకున్నాయని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ఈ మోసాలను నివారించే చర్యల్లో భాగంగా రూ. 50 కోట్లు ఆ పైన తీసుకున్న రుణాలకు సంబంధించిన ఖాతాలపై నిశిత పరిశీలన, అసలు ఆ మోసానికి గల కారణాల గుర్తింపు, క్రిమినల్ చర్యలు చేపట్టడంతోబాటు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే నేరస్థుల ఆటకట్టేందుకు కొత్త చట్టం 2018ని తీసుకురావడం జరిగిందన్నారు. మోసాలకు సంబంధించిన కేంద్ర రిజిస్టర్‌ను కూడా రూపొందించామని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులకు లుకవుట్ సర్క్యులర్లు జారీకి ప్రత్యేక అధికారాలివ్వడం జరిగిందన్నారు. కోర్ బ్యాంకింగ్ సిస్టం, ‘స్విఫ్ట్’లను క్రమబద్ధీకరించడం ద్వారా జాతీయ స్థాయిలో ఓ ఆర్థిక ఫిర్యాదుల విభాగాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా రూ. 50 కోట్లకు పైబడిన రుణాలు తీసుకున్న రుణ బకాయిలు ఉన్న సంస్థలు, లేదా కంపెనీలకు చెందిన యాజమాన్యం, డైరెక్టర్లుకు సంబంధించిన పాస్‌పోర్టుల సర్టిఫైడ్ కాపీలను సేకరించడం జరుగుతోందని ఆమె వివరించారు. ఈ రకమైన చర్యలతో గడచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వాణిజ్య బ్యాంకులు మొత్తం రూ. 4,01.424 కోట్ల రుణాలను రికవరీ చేశాయని, ప్రత్యేకించి 2018-19 సంవత్సరంలో రూ. 1,56,745 కోట్ల వసూళ్లు జరిగాయని నిర్మల ఎగువ సభకు తెలిపారు. అలాగే బ్యాంకుల సంస్కరణ చర్యల్లో భాగంగా బోర్డు ఆమోదిత రుణ విధానాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం చేపట్టడం జరిగిందన్నారు. రూ. 250 కోట్లకు పైబడిన రుణ బకాయిలపై ప్రత్యేక మానిటరింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఏక దఫా సెటిల్మెంట్లకు సైతం అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.