బిజినెస్

దేశీయ స్థూల ఉత్పత్తిలో ఔషధ రంగానిదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, జూలై 27: దేశీయ స్థూల ఉత్పత్తిలో ఔషధ రంగం పరుగులు పెడుతోందని రాంకీ ఫార్మా ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పీపీ లాల్‌కృష్ణ అన్నారు. విశాఖపట్నం జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కమర్షియల్ హబ్‌లో ‘ఆంధ్రభూమి’తో శనివారం ఆయన మాట్లాడారు. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఔషధ రంగం 13 శాతానికి పెరిగిందన్నారు. భారత ఔషధ రంగంపై గతంలో చైనా దేశం ప్రభావం అధికంగా ఉండేదన్నారు. దీంతో భారత దేశ ఔషధ స్థూల ఉత్పత్తి కాస్త తగ్గిందన్నారు. చైనాలో ఔషధ రంగం కాస్త ఒడుదుడుకులు ఎదుర్కొంటోందని, ఈ కారణంగా ఔషధ పారిశ్రామికవేత్తలంతా భారతదేశం వైపు దృష్టి సారించడంతో దేశీయ ఔషధ స్థూల జాతీయోత్పత్తి క్రమేపీ పెరిగిందన్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫార్మా ఎక్సెల్ అందించిన నివేదికే దీనికి ఆధారం అన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కెమిస్ట్రీ నాలెడ్జ్ భారతదేశంలో అత్యధికంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1300 బిలియన్ డాలర్ల ఔషధ ఉత్పత్తులు అవసరం ఉందన్నారు. అయితే ఇందులో భారతదేశం వాటా మాత్రం 50 నుండి 60 బిలియన్ల డాలర్లు మాత్రమే అన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. యుఎస్‌ఏ అత్యధికంగా ఔషధాలను వినియోగించుకుంటోందన్నారు. అందుకనే యుఎస్‌ఏలో మనిషి సగటు జీవితకాలం 88 సంవత్సరాలగా ఉందన్నారు. అదే భారతదేశంలో అయితే 68 సంవత్సరాలు మాత్రమేనన్నారు. యుఎస్‌ఏ వంటి దేశం కూడా భారతదేశంలో తయారయ్యే ఔషధాలపై ఆధార పడుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఔషధ పార్కుల్లో అత్యధికంగా ఏపీలోని విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద గల ఫార్మాసిటీలో యుఎస్‌ఏ ఎఫ్‌డీఐ ఆడిట్ పొందిన ఔషధ కంపెనీలు దాదాపు 20 వరకు ఉన్నాయన్నారు. ప్రపంచ స్థాయి ఔషధ కంపెనీల్లో పదో స్థానం అక్రమించుకున్న ప్రైజర్ ఔషధ కంపెనీ పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న జనరిక్ ఔషధ కంపెనీల్లో మొదటి 25 స్థానాలను అక్రమించుకున్న వాటిల్లో మైలాన్, ప్రైజర్, లుఫిన్, అరబిందో ఔషధ కంపెనీలు పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటయ్యాయన్నారు. 2004లో 10వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరవాడ వద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో ముందుకు వచ్చామన్నారు. ప్రస్తుతం ఫార్మాసిటీలో 82 ఔషధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని, పెట్టుబడులు కాస్త 25 వేల కోట్లకు చేరాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 32 వేల మంది ఉపాధి పొందితున్నట్లు డీఏసీ డైరెక్టర్ వెల్లడించినట్లు లాల్‌కృష్ణ తెలియజేశారు.

చిత్రం...‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతున్న రాంకీ ఫార్మాసిటీ ఎండీ డాక్టర్ పీపీ లాల్‌కృష్ణ