బిజినెస్

మళ్లీ నష్టాల బాటలోకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 29: గత వాణిజ్య వారం ముగింపు రోజైన శుక్రవారం కొంత ఊపిరిపోసుకు న్న దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ వారారంభ రోజైన సోమవారం నష్టాల బాటలోకి మళ్లాయి. దీం తో రెండు నెలల క్రితంనాటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆసియా దేశాల మార్కెట్ల నుంచి విదేశీ నిధులు భారీగా వెనక్కు వెళుతుండటం దేశీయం గా మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభా వం చూపిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 196.82 పా యింట్లు కోల్పోయి 0.52 శాతం నష్టాలతో 37,688.28 పాయింట్ల దిగువ స్థాయిలో స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 95.10 పాయింట్లు కోల్పోయి 0.84 శాతం నష్టాలతో 11,189.20 పాయింట్ల దిగువన స్థిరపడింది. ప్రధానంగా వాహన రంగంలో విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, పన్ను రాయితీల కల్పన, కొత్త విధానాల వంటివాటితో ప్రస్తుతం పెనుసవాళ్లు ఎదురై పెద్దయెత్తున స్తబ్దత నెలకొంది. అంతేకాకుండా పా త, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం సైతం సరికొత్త కష్టాలను తెచ్చిపెట్టిందని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్లే ఆటోమోబైల్ రంగంలో వాటాల విక్రయం భారీగా చోటుచేసుకుందంటున్నారు. రంగాల వారీగా తీసుకుంటే బీఎస్‌ఈలో వాహన రంగ వాటాలు 3.55 శాతం నష్టపోయాయి. అలాగే లోహ రంగం 3శాతం, టెలికాం రంగం 2.85 శాతం వంతున నష్టపోయాయి. అలాగే బీఎస్‌ఈలో ఐటీ, బ్యాంకింగ్, టెక్ రంగాలు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈలో 1,706 స్టాక్స్ నష్టపోగా, 766 లాభపడ్డాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో టాటామోటార్స్ అత్యధికంగా 6.52 శాతం నష్టాలపాలైంది. అలాగే వేదాంత 5.09 శాతం, బజాజ్ ఆటో 4.99 శాతం, మారుతీ సుజుకీ 4.26 శాతం, టాటా స్టీల్ 2.65 శాతం వంతున నష్టపోయాయి. సెనె్సక్స్‌లోని 30 స్టాక్స్‌లో మొత్తం 23 స్టాక్స్ నష్టపోగా, 7 మాత్రమే లాభపడ్డాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా 3.32 శాతం లాభపడ్డాయి. కాగా దేశ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పరిస్థితులతో ఇక్కడి మార్కెట్లు ప్రభావితం కాగా, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం 14 పైసలు బలపడి ఇంట్రాడేలో మొత్తం రూ. 68.75గా ట్రేడైంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.11 శాతం తగ్గి బ్యారెల్ 63 డాలర్ల వంతున ట్రేడైంది. కాగా విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) దేశీయ కేపిటల్ మార్కెట్ల నుంచి రూ. 1,503,26 కోట్ల విలువైన వాటాలను గత శుక్రవారం విక్రయించడం జరిగింది. కాగా ఓ వైపు చైనా-అమెరికా వాణిజ్య వివాదాల పరిష్కారానికి మళ్లీ చర్చలు ఆరంభించినా, అమెరికన్ ఫెడరల్ రిజర్వు దాదాపు దశాబ్ధం తర్వాత రేట్ల కోత విదించనుందని సంకేతాలు వచ్చినా ఆసియా మార్కెట్లు పెద్దగా ప్రభావితం కాలేదు. చైనా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగియగా, షాంఘై కాంపోజిట్ సూచీతోబాటు, హ్యాంగ్‌సెంగ్, దక్షిణ కొరియా, కోస్పి సైతం నష్టాలను నమోదు చేశాయి. అలాగే జపాన్ సూచీ నిక్కీ కూడా నష్టాల పాలైంది.