బిజినెస్

ఇనె్వస్టర్ల భద్రతకు అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 14: దేశంలోని స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా వివిధ కంపెనీల్లో మదుపు చేసే ఇనె్వస్టర్ల భద్రతకు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధిక ప్రాధాన్యం ఇస్తుందని జనరల్ మేనేజర్ కృష్ణానంద్ రాఘవన్ పేర్కొన్నారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్స్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1992 సెబీ ఏర్పాటైననాటి నుంచి ఇప్పటి వరకూ కాలాగుణంగా కొత్త చట్టాలతో పాటు సాంకేతికంగానూ మార్పులు చేపడుతూ వస్తున్నట్టు తెలిపారు.
మార్కెట్‌లో కొంతమంది దళారులు చేసే నేరాలపై కూడా ప్రత్యేక విభాగం ద్వారా నిఘా ఉంచుతున్నామన్నారు. విద్యార్థులకు ఆర్థిక అంశాలపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ పేరిట విద్యాలయాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నిర్ణయాల ద్వారా విదేశీ పెట్టుబడుల శాతం ఆశాజనక రీతిలో పెరిగిందన్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) నిపుణుడు వై సంతోష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో డీమాట్ అకౌంట్‌ల సంఖ్య 188.18 లక్షలకు చేరుకుందని, తద్వారా రూ.179.18 లక్షల కోట్లు డిపాజిట్‌ల రూపంలో చేకూరాయని తెలిపారు. ఇది ప్రజల ఆర్థిక అక్షరాస్యతకు నిదర్శనమన్నారు. ఎన్‌ఎస్‌డీఎల్ కార్యకలాపాలను సంతోష్ రెడ్డి వివరించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ విభాగం అధిపతి డాక్టర్ ఎంఎస్‌వీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ వై గౌతమ్‌రావు ఇనిస్టిట్యూట్ ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు షేర్ మార్కెట్‌పై ఉన్న సందేహాలను అతిథులు నివృత్తి చేశారు.