బిజినెస్

గణనీయంగా పుంజుకుని లాభపడిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. హెవీ వెయిట్స్ సూచీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడం మార్కెట్లకు సానుకూలంగా మారింది. అంతేకాకుండా ఆసియా మార్కెట్లు సైతం బుధవారం కోలుకుని లాభాల బాట పట్టడం మన స్టాక్ మార్కెట్లకు అనువుగా మారింది. కాగా ద్రవ్యోల్బణ గణాంకాలు సరళతరం కావడం సైతం దేశీయ మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేసిందని వాణిజ్యవర్గాలు పేర్కొంటున్నాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ బుధవారం ఏకంగా 515 పాయింట్లు ఎగబాకింది. తర్వాత దిద్దుబాటుకు గురై 353.37 పాయింట్ల ఆధిక్యతతో 0.96 శాతం లాభాలతో 37,311.53 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 37,473.61 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 37,000.77 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ కీలక 11,000 పాయింట్ల మార్కును అధిగమించింది. మొత్తం 103.55 పాయింట్లు ఎగబాకిన ఈ సూచీ 0.95 శాతం లాభాలతో 11,029.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 11,078.15 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 10,935.60 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత, టాటా స్టీల్, యెస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, భారతి ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 4.83 శాతం లాభపడ్డాయి. మరోవైపు సన్‌పార్మా, ఓఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ 4.58 శాతం నష్టాలను సంతరించుకున్నా యి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా మారడంతోబాటు, రీటైల్, టోకు వర్తక ద్రవ్యోల్బణం సరళతరం కావడం వల్ల రిజర్వుబ్యాంకుకు వచ్చే అక్టోబర్‌లో మరోమారు రెపోరేట్ల కోతకు వీలుకలిగింది. ఈ అంశాలన్నీ మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపాయని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. గడచిన జూలైలో రీటైల్ వర్తక ద్రవ్యోల్బణం 3.15 శాతం తగ్గింది. అలాగే టోకు వర్తక ద్రవ్యోల్బణం సైతం రెండున్నరేళ్ల కనిష్ట స్థాయి 1.08 శాతానికి దిగివచ్చిందని ప్రభుత్వ గణాంకాల మేరకు స్పష్టమవుతోంది.
కోలుకున్న ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు బుధవారం గణనీయంగా కోలుకున్నాయి. చైనా ఉత్పత్తుల దిగుమతులపై అదనపు సుంకాలు విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వాయిదా వేయడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం విషయంలో పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని ప్రకటించడం ప్రపంచ దేశాల మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఆసియాలోని హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ, షాంఘై కాంపోజిట్ సూచీ నష్టాల నుంచి కోలుకుని లాభాల బాటపట్టాయి. ఐతే ఐరోపా మార్కెట్లు మాత్రం బుధవారం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను నమోదు చేశాయి. ఇందుకు ప్రధాన కారణం జర్మనీ ఆర్థికాభివృద్ధి రేటు గడచిన జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 0.1 శాతం తగ్గడమేనని విశే్లషకులు పేర్కొన్నారు. కాగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం 13 పైసలు బలపడి ఇంట్రాడేలో రూ. 71.23గా ట్రేడైంది.