బిజినెస్

ప్రమాదంలో ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశ ఆర్థిక వ్యవస్థపై నీతి అయోగ్ వైస్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. గత 70 ఏళ్లలో ఏ ఒక్కరూ ఎదుర్కోని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ తయారైందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం వ్యాఖ్యలపై సీతారాం ఏచూరి స్పందించారు. ‘దేశ ఆర్థికరంగం ప్రమాదంలో పడిపోయింది.. ఇది ఊహించని పరిణామం’ అంటూ రాజీవ్‌కుమార్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీతారాం ఏచూరి శుక్రవారం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుం టే దేశం సంక్షోభంలో కూరుకుపోనుందని తెలుస్తోందని. ఇది ఆందోళనకరం అన్నారు. ‘లక్షలాది ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై కుంటిసాకులు చెబుతోం ది’ అని ఏచూరి ఆరోపించారు. ‘ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ విధానాన్ని పక్కన పెడదాం.. నీతి అయోగ్ చీఫ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చెందిన ఇద్దరు సభ్యులు ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు.. తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మ కం పోతుంది’ అని ఏచూరి వ్యాఖ్యానించారు. ప్రభు త్వ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలపై ఎవరు బాధ్యత వహించగలరని ఏచూరి ట్వీట్‌లో ప్రశ్నించారు.