బిజినెస్

ప్రభుత్వ ‘ప్రోత్సాహం’తో సూచీల దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : ఊహించిన విధంగానే కేంద్ర రాయితీలు, ప్రోత్సాహకాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నాడు పరుగు లంఘించుకుని ఒక రోజు అత్యుత్తమ ఆదిక్యతను నమోదు చేశాయి.
ప్రధానంగా విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులపై పెంచిన సర్‌చార్జీలను తొలగించడంతోబాటు, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకింగ్ స్టాక్స్ భారీ లాభాలను సంతరించుకున్నాయి. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఏకంగా 792.96 పాయింట్లు ఎగబాకి 2.16 శాతం లాభాలతో 37,494.12 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 37,544.48 పాయింట్ల గరిష్టం, 36,492.65 పాయింట్ల కనిష్టం మధ్య క్దలాడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 11,000 మార్కును అధిగమించింది. 228.50 పాయింట్ల ఆధిక్యతను సాధించిన ఈ సూచీ 2.11 శాతం లాభాలతో 11,057.85 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ సైతం 11,070.30 పాయింట్ల గరిష్టం, 10,756.55 పాయింట్ల కనిష్టం నడుమ కదలాడింది. గడచిన మే 20 నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ సూచీలకు ఇవే అత్యుత్తమ ఆధిక్యతలు కావడం విశేషం. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింతగా ముదిరి అంతర్జాతీయంగా మార్కెట్లకు ప్రతికూలతలు ఉన్నా దేశీయ మార్కెట్లు గణనీయమైన లాభాల వైపు పరుగులు తీయడం గమనార్హం. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్ లాభాల్లో అగ్రభాగాన నిలించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ సైతం 5.24 శాతం లాభపడ్డాయి. మరోవైపు టాటాస్టీల్, సన్‌పార్మా, హీరో మోటోకార్ప్, వేదాంత, ఆర్‌ఐఎల్, టాటా మోటార్స్, మారుతి సుజుకీ, బజాజ్ ఆటో 2.01 శాతం నష్టపోయాయి. ఇలావుండగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ జ్వాలలకు ఆజ్యం పోస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేశాయి. చైనా ఉత్పత్తుల దిగుమతులపై అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో షాంఘై కాంపోజిట్ సూచీతోబాటు, హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ సోమవారం నష్టాలపాలయ్యాయి. ఐతే సోమవారమే మధ్యాహ్నం తర్వాత ట్రంప్ మరోమారు మాట్లాడుతూ అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ సమస్యను పరిష్కరించుకునే దిశగా త్వరలో మళ్లీ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. చైనా సైతం చర్చలకు సుముఖంగా ఉందన్న వార్తలు రావడంతో మధ్యాహ్నం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు కనిష్ట స్థాయి నుంచి కోలుకున్నాయి. కాగా ఐరోపా దేశాల స్టాక్ మార్కెట్లు మాత్రం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాల్లోనే సాగాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు నష్టపోయింది. ఇంట్రాడేలో డాలర్‌కు రూ.71.87గా ట్రేడైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 0.92 శాతం వృద్ధితో బ్యారెల్ 59.34 డాలర్లు వంతున ట్రేడైంది.