బిజినెస్

నిలకడగా పసిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: వరుసగా ఐదు రోజులపాటు రికార్డుల మోత మోగించిన బంగారం ధరలు ఎట్టకేలకు మంగళవారం స్థిరంగా సాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ. 29,670 పలికింది. సోమవారం నాడు ట్రేడైన ఆల్‌టైం రికార్డు స్థాయి ధరలో మంగళవారం ఎలాంటి హెచ్చుతగ్గులూ చోటుచేసుకోలేదు. వెండి ధర మాత్రం కిలోపై రూ. 190 పెరిగి మొత్తం ధర రూ. 46.740కి చేరింది. పరిశ్రమల యూనిట్లు, నాణేల వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండే తాజాగా వెండి ధరల పెరుగుదలకు దోహదం చేశాయని ఆఖిల భారత సరాఫా అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇక అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,531.40 డాలర్ల గరిష్ట స్థాయికి చేరింది. అలాగే వెండి సైతం ఔన్స్ 17.78 డాలర్ల గరిష్ట స్థాయిలోనే ట్రేడైంది. ఓవైపు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నప్పటికీ ఆ ప్రభావం అక్కడి బంగారం ధరలపై పడలేదు. అటు అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు పరిష్కరించుకునే దిశగా మళ్లీ చర్చలు ఆరంభించేందుకు నిర్ణయించడం స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది. కాగా ఢిల్లీలో మంగళవారం 99.9 శాతం స్వచ్ఛ బంగారం రూ. 39,670, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 39,500 వంతున ట్రేడయ్యాయి. ఇక వెండి వార సరఫరా విధానంలో కిలోపై రూ. 164 పెరిగి మొత్తం ధర రూ. 45,127కు చేరింది. వెండి నాణేలు 100 పీసుల ధర విక్రయాల్లో రూ. 97వేలు, కొనుగోళ్లలో రూ. 96 వేల వంతున ట్రేడయ్యాయి.