బిజినెస్

గురుగ్రాంలోని డీఎల్‌ఎఫ్ ఆస్తులు లీజుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: స్థిరాస్తి వ్యాపార దిగ్గజం డీఎల్‌ఎఫ్ హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో గల తన ఆస్తులన్నింటినీ లీజుకివ్వడం జరిగింది. మొత్తం 2.5 మిలియన్ చదరపుటడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తుల ద్వారా రూ. 375 కోట్ల వార్షికాదాయం సమకూరుతుందని సంస్థ అంచనా వేస్తున్నట్టు డీఎల్‌ఎఫ్ గ్రూప్ అద్దెల వాణిజ్య విభాగం ఎండీ శ్రీరామ్ ఖట్టర్ బుధవారం నాడిక్కడ తెలిపారు. 12 ఎకరాల విస్తీర్ణంలో సైబర్ పార్కును డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ ద్వారా సార్వభౌమ నిధుల నిర్వహణ సంస్థ జీఐసీ భాగస్వామ్యంతో నిర్మించడం జరుగుతోంది. ఇందుకు రూ. 1,500 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ప్రస్తుతం చిన్న రీటెయిల్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయాన్ని గ్రేడ్-ఎ కమర్షియల్ కాంప్లెక్స్‌లోకి మార్చేందుకు స్థలాన్ని లీజుకివ్వడం జరిగిందని ఆయన చెప్పారు. కాగా ప్రస్తుతం డీఎల్‌ఎఫ్ ప్రస్తుతం 30 మిలియన్ చదరపుటడుగుల వాణిజ్య ఆస్తులను లీజుకివ్వడం ద్వారా అద్దెల ద్వారా రూ. 2,900 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.