బిజినెస్

బాండ్ల జారీ ద్వారా.. రూ. 10వేల కోట్లు సమీకరణకు ‘పవర్‌గ్రిడ్’ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంతో బాండ్లను జారీ చేయడం ద్వారా రూ. 10 వేల కోట్లు సమీకరించేందుకు తమ కంపెనీ వాటాదారులు అంగీకారం తెలిపారని ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ గురువారం నాడిక్కడ తెలిపింది. దేశీయ మార్కెట్ల నుంచి సెక్యూర్డ్ లేదా నాన్ సెక్యూ ర్డ్, మార్పులు చేయలేని, పన్ను సహిత, పన్ను రహిత వంటి వివిధ రకాల బాండ్లను లేదా డిబెంచర్లను జారీ చేసి 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిధులు సమీకరించేందుకు ప్రత్యేక తీర్మానాన్ని చే యడం జరిగిందని పవర్‌గ్రిడ్ సంస్థ తన స్టాక్‌మార్కెట్ ఫైలింగ్‌లో వివరించింది. మొత్తం 20 ట్రాన్‌చెస్‌ల ద్వారా ఈ నిధులు సమీకరించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈనెల 27 జరిగిన సంస్థ వాటాదారుల సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన కం పెనీ బోర్డు ఆమోదం గత జూలై 3న లభించిందని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిధుల ఆవశ్యకత ను బట్టి సమీకరణలో మార్పులు చోటుచేసుకుంటాయంది. ప్రధానంగా సంస్థ మూలధన బలోపేతానికి నిధులను వినియోగించుకోవడం జరుగుతుందని, అనుబంధ సంస్థలను బలోపేతం చేసేందుకు అంతర్గత సహకార రుణాలను ఇవ్వాలన్న ప్రతిపాదలు కూడా ఉన్నాయని తెలిపింది. 2020-21లో మూలధన వ్యయం 10 నుంచి 15 వేల కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనాలున్నాయని తెలిపింది.