బిజినెస్

పసిడి ధర ‘రికార్డు’ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పసిడి ధరల రికార్డుల మోత సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 250 పెరిగి ఏకంగా రూ. 40 వేల మార్కును అధిగమించింది. మొత్తం ధర రూ. 40,220కి చేరింది. దేశ బులియన్ మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధరగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో అధికమవుతున్న మాంద్య భయాలతో మదుపర్ల నుంచి పెట్టుబడులు బంగారం వైపు మళ్లడంతోబాటు, దేశీయ వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండ్ బంగారం ధరలు మరింత పైపైకి ఎగబాకేందుకు దోహదం చేశాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం తులంపై రూ. 300 పెరిగి రూ. 39.870కి చేరిన ధర గురువారం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక వెండి ధర సైతం రూ.50వేల మార్కు దిశగా సాగుతోంది. గురువారం కిలోపై రూ. 200 పెరిగి మొత్తం ధర రూ. 49,050కి చేరింది. పారిశ్రామిక యూనిట్ల నుంచి, నాణేల వ్యాపారుల నుంచి, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌తో వెండి ధరలకు మరింతగా ఊతం లభించిందని భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక మాంద్యం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ తీవ్రతతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులనే ప్రస్తుతానికి సురక్షితంగా భావిస్తున్నారని విశే్లషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో సైతం బంగారానికి ఆదరణ పెరుగుతోంది.
న్యూయార్క్‌లో గురువారం ఔన్స్ బంగారం ధర 1,539 డాలర్ల వంతున ట్రేడైంది. ఒక దశలో ఈధర 1,550 డాలర్ల గరిష్టాన్ని తాకింది. వెండి సైతం ఔన్స్‌పై 1.15 శాతం ధర పెరిగి 18.63 డాలర్లకు చేరింది. రూపాయి విలువ బలహీన స్థాయికి చేరడం సైతం దేశీయంగా పసిడి ధరల పరుగుకు మరో కారణమైందని అంటున్నారు. ఇలావుండగా దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం రూ. 40,220, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 40.050 వంతున ట్రేడయ్యాయి.
ఇక సవరం (ఎనిమిది గ్రాముల) బంగారం ధర గురువారం రూ. 400 పెరిగి రూ. 30,200కు చేరింది. ఇక వెండి ధర వారపద్ధతి డెలివరీలో కిలోపై రూ. 814 పెరిగి రూ. 47,230కి చేరింది. అలాగే వెండి నాణేలకు సైతం విపరీతమైన గిరాకీ ఏర్పడింది. 100 పీసులపై ఏకంగా రూ. 3000 వేలు పెరిగి కొనుగోళ్లలో రూ. 1,01,000, విక్రయాల్లో రూ. 1,02,000 వంతున ట్రేడైంది.