బిజినెస్

సాగర్‌లో ఆగిన విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 29: నాగార్జునసాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గత నాలుగు, ఐదు రోజులుగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ సందర్భంగా జెన్‌కో ఎస్‌ఈ రాజనర్సయ్య మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులు ఇంకా నిర్ణయించనందున గత నాలుగు రోజుల నుండి ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేశామన్నారు. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో లేని కారణంగా సాగర్‌లో నీటిమట్టం పూర్తి స్ధాయి నీటి మట్టం 590 అడుగుల కంటే తక్కువగా ఉన్నందున విద్యుత్ ఉత్పత్తిని చేపట్టడం లేదన్నారు. సాగర్ జలాశయంలో పూర్తి స్ధాయి నీటిమట్టం ఉండి ఇన్‌ఫ్లో వస్తున్నప్పుడు మాత్రమే తప్పనిసరిగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుందన్నారు. అలా కాని పరిస్ధితుల్లో కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులు జరిగితే ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ మాసం నుండి ఆగస్టు మాసం వరకు 274 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 588.60 అడుగుల నీటిమట్టం ఉండగా కుడి కాల్వ ద్వారా 7,578 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,986 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300క్కూసెక్కులు విడుదల చేస్తున్నారు.