బిజినెస్

సమకాలీన అవసరాలకు అనుగుణంగా ఆయుర్వేద ఉత్పత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: శీఘ్ర విక్రయ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ) రంగ దిగ్గజం ‘డాబర్ ఇండియా’ సమకాలీన ఆయుర్వేద ఔషధాలతోబాటు సంప్రదాయ ఔషధాల తయారీపై దృష్టి సారించింది. అభివృద్ధి వ్యూహంలో భాగంగా సంప్రదాయ దృక్పథంతో కూడిన ఔషధాలను ప్రవేశపెట్టేందుకు పరిశోధనాత్మకంగా ముందడుగు వేస్తున్నట్టు ఆ కంపెనీ కొత్త చైర్మన్ అమిత్ బర్మన్ నాడిక్కడ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన కంపెనీ వాటాదారుల సర్వసభ్య సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం సాగింది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ముందడుగు వేస్తున్న తమ కంపెనీకి అంతర్జాలంలో సైతం మిలియన్ మంది వినియోగదారులున్నారని ఆయన తెలిపారు. ప్రధానంగా తమ కంపెనీ బ్రాండ్ ఉత్పత్తులకు ఆన్‌లైన్‌లో యువకులే అధికంగా వినియోగదారులుగా ఉన్నారన్నారు. అందుకే సమకాలీన అవసరాలను దృష్టిలో ఉంచుకు వస్తూత్పత్తిలో పరిశోధనాత్మకంగా ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం ఆరోగ్యప్రదమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయం, వినియోగంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. మారిన ఈకామర్స్, డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా వ్యాపార విస్తరణ చేస్తున్నామన్నారు.