బిజినెస్

మందగించిన జీడీపీ వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఇటు తయారీ రంగంలోనూ.. అటు వ్యవసాయ రంగంలోనూ నెలకొన్న మాంద్య పరిస్థితుల ప్రభావం స్థూల జాతీయోత్పత్తిపై తీవ్రంగా పడింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ వృద్ధి రేటు ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఐదు శాతం దిగువకు చేరుకొంది. ఈమేరకు ప్రభుత్వం అధికారిక వివరాలను శుక్రవారం వెల్లడించింది. తయారీ రంగంలో విలువ ఆధారిత వృద్ధి రేటు 12.1 శాతం నుంచి 0.6 శాతానికి పడిపోయిందని ఈ వివరాల వల్ల స్పష్టవౌతోంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత స్థూల వృద్ధి రేటు 5.1 శాతం ఉందని... తాజాగా ఇది రెండు శాతానికి పడిపోయిందని ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, నిర్మాణ రంగం కూడా ఇదే కాల వ్యవధిలో 9.6 శాతం విలువ ఆధారిత స్థూల వృద్ధి రేటు నుంచి 5.7 శాతానికి దిగిపోయిందని వివరాలు చెబుతున్నాయి. అయితే, గనుల రంగం మాత్రం 0.4 శాతం జీవీఏ నుంచి 2.7 శాతానికి పెరిగిందని వివరాలు స్పష్టం చేస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో అత్యంత కనిష్ట స్థాయిలో 4.9 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. తాజాగా ఏడేళ్ల తరువాత ఇది ఐదు శాతానికి చేరుకొందని జాతీయ గణాంకాల కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
పెట్టుబడులకు సంకేతంగా నిలిచే స్థూల స్థిర మూలధనం ప్రస్తుత త్రైమాసికంలో 11.66 లక్షల కోట్ల మేర ఉందని.. ఏడాది క్రితం ఉన్న ఈ మొత్తం 11.21 లక్షల కోట్లని ఈ సంస్థ తెలిపింది.