బిజినెస్

భారీగా విదేశీ వాటాల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: గడచిన ఆగస్టు నెలలో మన దేశ ప్రధాన మార్కెట్ల నుంచి 5,920 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కు వెళ్లాయి. ఒకవైపువిదేశీ పోర్టుపోలియో పెట్టుబడులపై విధించిన అదనపుసర్‌చార్జీని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ ఈ నిధుల ఉపసంహరణకు అడ్డుకట్టవేయలేక పోవడం విశేషం. తాజా ‘డిపాజిటరీస్ డేటా’ మేరకు విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఆగస్టులో మొత్తం రూ. 17,592.28 కోట్ల రూపాయల విలువైన వాటాలు కొనుగోలు చేయగా, రూ. 11,672.26 కోట్ల రూపాయల విలువైన వాటాలు విక్రయించారు. అంటే మనదేశం రూ. 5,920 కోట్ల విదేశీ పెట్టుబడులు కోల్పోయింది. అటు ఈక్విటీ మార్కెట్లతోబాటు రుణ మార్కెట్ల నుంచి ఈ పెట్టుబడులు తరలిపోయాయి. కాగా గత జూలైలో విదేశీ మదుపర్లు రూ. 2,985 కోట్ల విలువైన వాటాలను కీలక మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. వరుసగా ఐదు నెలలపాటు విదేశీ మదుపర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు తగ్గించారు. దేశీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరిగిన ఆర్థిక మాంద్య భయాలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలతో విదేశీ మదుపర్లు వెనకడుగు వేశారని నిపుణులు అంచనా వేస్తున్నారు.