బిజినెస్

ఆక్వా ఎగుమతులు పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 5: దేశంలోని ఆక్వా ఎగుమతులను లక్ష కోట్లకు పెంచుతామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, డైయిరీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగానికి ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా అభివృద్ధి చెందిన కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం రాత్రి భీమవరంలోని ఆనంద గ్రూప్‌కు చెందిన హ్యాచరీ, అంతర్జాతీయ రొయ్య పరీక్షలు చేసే ల్యాబ్‌లను పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. దీనికి ముందు ఆయన ఆక్వా సీడ్, ఫీడ్ తయారుచేసే పరిశ్రమలను పరిశీలించారు. భీమవరంలోని ఆనంద గ్రూప్‌లో అంతర్జాతీయంగా ఎగుమతి అవుతున్న తక్కువ కౌంట్‌లో ఉన్న వనామి, రూప్‌చంద్, ఫంగస్, పీతలు, పండుగప్ప తదితర రకాలను ఆ సంస్థ ఛైర్మన్ యుకె విశ్వనాధరాజు చూపించారు. ఎంత కాలంలో ఆయా రకాల పంటలు చేతికొస్తాయి, ఎంత ఆదాయాన్ని రైతుకు అందిస్తుందో కేంద్ర మంత్రి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగానికి కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి ప్రకటించారు. ఆక్వా అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ.1000 కోట్లు కేటాయించామని, ఇప్పటికే 80 శాతం నిధులు విడుదలచేశామన్నారు. ఎకరాకు 3 టన్నుల వనామి రొయ్యలు ఉత్పత్తి చేస్తున్నారని, దాన్ని పది టన్నులకు తీసుకువెళ్ళే విధంగా చర్యలు చేపడతామన్నారు. మెరైన్, బ్రాకిష్, ఇన్‌ల్యాండ్ విధానంలో ఆక్వా ఉత్పత్తి పెంచుతామన్నారు. ఇక్కడి ఆక్వా రైతులు దేశానికి పరిచయం కావాలన్నారు. కాగా ఆక్వా రంగంలోని పలు సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు ఆనంద గ్రూప్ ఛైర్మన్ యుకె విశ్వనాథరాజు ఫిర్యాదుచేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసే వాళ్ళమని, కానీ ఇటీవల కాలంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. దీనివల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దేశంలో ఏ ప్రాంతానికైనా లైవ్ ఫిష్‌ను ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా మత్స్యశాఖ ద్వారా మరిన్ని రకాలను తీసుకురావాలన్నారు. బ్రూడ్ స్టాక్ (తల్లి రొయ్యలు) కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపెడా, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖలకు చెందిన అధికారులతో పాటు బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘెళ్ళ రఘురాం, జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, పాకా సత్యనారాయణ, పీవీఎస్ వర్మ మంత్రి వెంట ఉన్నారు.
చిత్రం...భీమవరంలోని ఆనందా హేచరీలో చేపలను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్