బిజినెస్

పరిశ్రమలకు రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, సెప్టెంబర్ 7: చత్తీస్‌గఢ్‌లో పరిశ్రమల స్థాపనకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల కేటాయింపుల ధరలు 30 శాతం తగ్గించనున్నట్టు ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రకటించారు.
పారిశ్రామికీకరణ వల్ల అపారపై ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శనివారం ఇక్కడ చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాల ప్రతినిధులతో ఏర్పాటైన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎవరైనా పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వస్తే భూ కేటాయింపుధరలను 30 శాతం తగ్గించి అందచేస్తామని స్పష్టం చేశారు. అలాగే భూముల లీజు అద్దె ధరలూ 3 నుంచి రెండు శాతానికి తగ్గిస్తామని అన్నారు. అలాగే పారిశ్రామికవేత్తలకు పలు ప్రోత్సహాకాలు సీఎం ప్రకటించారు. తక్కువ రేటుకు భూములు, వడ్డీపై సబ్సిడీ, ఫుడ్ ప్రాసెసింగ్‌పై పన్ను రిబేటు కల్పిస్తారు. చిట్టడవుల్లో ఔషధ మొక్కలు యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ‘ఈ కొత్త విధానం వచ్చే రెండు నెలల నుంచి అమలవుతుంది. పారిశ్రామికీకరణతో పాటు వ్యవసాయం రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ప్రధాన పరిశ్రమలైన ఉక్కు, సిమెంట్ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో(ఏకగవాక్ష) విధానం అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. భూమి అందుబాటులోకపోవడం వల్ల పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్న ముఖ్యమంత్రి ‘ఇక నుంచి అలాంటి పరిస్థితి తలెత్తదు. అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమల కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఆ శాఖకు భూములు బదలాయించి అక్కడ నుంచి పారిశ్రామికవేత్తలకు అందచేసేలా చర్యలు తీసుకుంటాం’అని భూపేష్ బఘెల్ స్పష్టం చేశారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని సీఎం అన్నారు. పరిశ్రమలకు స్థాపనకు భూమి కేటాయింపుజరుగుతుందని అయితే యజమాని ఏడాది లోపుఅక్కడ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఒక వేళ గడువులోగా యూనిట్ ఏర్పాటు చేయకపోతే భూములను వెనక్కి తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆ భూమి మరొకరికి కేటాయిస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కల్పన జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.