బిజినెస్

నాలుగు రోజుల వ్యవధిలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: మన దేశ ప్రధాన మా ర్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌పోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) వాటాల ఉపసంహరణను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈనెల తొలి వారంలోనే మొత్తం రూ. 1,263 కోట్ల విలువైన పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకోవడం జరిగింది. కేంద్రం ఉద్దీపన చర్యలు చేపట్టినా అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో ఎఫ్‌పీఐలు లాభాల స్వీకరణపై మొగ్గుచూపారని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. డిపాజిటరీస్ తాజా గణాంకాల మేరకు ఈనెల 3 నుంచి 6వ తేదీ వరకు ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 4,263.79 కోట్ల విలువైన పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. అలాగే రూ. 3,000.86 కోట్లు రుణ మార్కెట్లలో మదుపు చేశారు. అంటే ఈక్రమంలో మొత్తం రూ. 1,262.93 కోట్ల మొత్తం పెట్టుబడులు తరలిపోయాయి. ఈ నెల 2న వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవుదినమైన సంగతి తెలిసిందే. ఇలావుండగా గడచిన రెండు నెలల కాలంగా విదేశీ పోర్ట్‌పోలి యో ఇనె్వస్టర్లే అత్యధికంగా వాటాల విక్రయాలకు పాల్పడ్డారు. మొత్తం రూ. 5,920.02 కోట్లు ఆగస్టులో, అంతకుముందు జూలైలో రూ. 2,985.88 కోట్లు అటు ఈక్విటీ, ఇటు రుణ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకోవడం జరిగింది. గత శుక్రవారం ప్రకటించిన జీడీపీ వృద్ధిరేటు అంచనా లు కొంతమంది మదుపర్ల సెంటిమెంటుపై ప్రభా వం చూపిందని ప్రముఖ విశే్లషకుడు హర్ష్‌జైన్ తెలిపారు. గడచిన కేంద్ర బడ్జెట్‌లో విదేశీ పెట్టుబడులపై సర్‌చార్జీలను పెంచుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో జూలై, ఆగస్టు మా సాల్లో విదేశీ ఇనె్వస్టర్లు రూ.30 వేల కోట్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ దిగజారిన వృద్ధిరేటు అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలతో ప్రస్తుతం వాటాల విక్రయాలు కొనసాగుతూ ఉన్నాయని మరో విశే్లషకుడు అజిత్‌మిశ్రా వివరించారు.