బిజినెస్

చలో..తెలంగాణ!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో మద్యనిషేధం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విజయభాస్కరెడ్డి హయాంలో సారాతో మొదలైంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఐఎంఎఫ్‌ఎల్‌కు బ్యాన్‌పెట్టి హెల్త్ పర్మిట్లకు మాత్రం కొంచెం సడలింపునివ్వగా, మామను మించిన అల్లుడు ఆపాటి వెసులుబాటునూ బంద్ చేశారు. ఇలా మద్యనిషేధం అమలు ముగ్గురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జరుగ్గా, దానిని దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానంటూ పాదయాత్రలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని తు.చ.తప్పకుండా అమల్లోకి తీసుకువచ్చారు. దీనివల్ల ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రూ. 300 కోట్లు ఆదాయం లేకుండా పోతోంది. కొద్దిరోజులుగా మద్యం వ్యాపారులు అందుబాటులో ఉండడం లేదు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మద్యం వ్యాపారం చేస్తున్న వారెవరూ దొరకడం లేదు. అందరి కుటుంబాల్లోనూ చెబుతున్న మాట ఒకటే. హైదరాబాద్ వెళ్లారని.. ఇంతమంది ఒక్కసారిగా హైదరాబాద్ వెళ్లి వస్తుండడం వెనుక కారణమేమిటని ఆరాతీస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మనరాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి అనుకూలంగా అడుగులు పడుతుండడంతో దశలవారీగా వైన్‌షాపులు సర్కార్ షాపులుగా మారిపోతున్నాయి. దీంతో ఇన్నాళ్లూ మద్యం వ్యాపారం తప్ప మరో వ్యాపకం తెలియని వ్యాపారులు తెలంగాణా బాట పడుతున్నారు. ఈ నెలాఖరు నాటికి తెలంగాణాలో మద్యం పాలసీకి కాలం చెల్లిపోతుంది. అక్టోబర్ ఒకటి నుంచి తెలంగాణాలో కొత్త మద్యం పాలసీకి తెర లేవనుంది. 2019-21 కాలపరిమితికి టెండర్లు పిలవడానికి తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆంధ్రాలో మద్యం షాపులు మూత పడుతుండడం, తెలంగాణాలో పాత పాలసీకి కాలం చెల్లి కొత్త టెండర్లకు రంగం సిద్ధం కావడంతో ఏపీలో ఉన్న 13 జిల్లాల నుంచి మద్యం వ్యాపారులు ఛలో..తెలంగాణా అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనుసరించిన పాలసీనే తెలంగాణా ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తోంది. ఈ పాలసీ ఏపీ మద్యం వ్యాపారులకు కొట్టిన పిండి. దీంతో టెండర్లు వేయడమే ఆలస్యం. షాపుల దక్కించుకోవడం సులభతరమని అందరిలోనూ భావన. దీనికితోడు కేసీఆర్ సర్కార్ కూడా ఏపీ మద్యం వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతోంది. ప్రస్తుతం తెలంగాణలో సెవెన్ టైమ్స్ పాలసీ నడుస్తోంది. రెండేళ్ల కాలపరిమితికి ఈ నెల 23వతేదీన తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 26 తర్వాత టెండర్లు ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు తెలిసింది. అందుకే ఆంధ్రాలో ఉన్న 13 జిల్లాల నుంచి దాదాపు మూడు వేలకు పైచిలుకు దరఖాస్తులు పడతాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏపీ నుంచి మూడు వేల దరఖాస్తులు పడితే అందులో 300 మద్యం దుకాణాలు ఏపీ వ్యాపారులకు దక్కే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ.300కోట్లు ఆదాయం ఆంధ్రా నుంచి తెలంగాణాకు తరలిపోతున్నట్టే!! ఇది కాకుండా ఏడాదికి రూ. 30 వేల కోట్లు టర్నోవర్ కూడా జరుగుతుంది. పోనీ పరిస్థితులు అనుకూలించ లేదనుకుంటే కనిష్టంగా రూ.15వేల కోట్లు టర్నోవర్ అయినా జరుగుతుందని తెలంగాణ అబ్కారీ అధికారులు ఇప్పటికే అక్కడ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2014లో రాష్ట్రం వీడిపోయినప్పుడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ శాఖకు సంబంధించిన చాలామంది తెలంగాణా అధికారులు ఆంధ్రాలో పనిచేశారు. ఇప్పుడు వారి సహకారంతో ఆంధ్రా మద్యం వ్యాపారులంతా తెలంగాణాకు క్యూ కడుతున్నారు. మహబూబునగర్, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో షాపులు దక్కించుకోవడం కోసం ఆంధ్రా వ్యాపారులు ఛలో తెలంగాణా అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద మూడు వేల దరఖాస్తులకు సిద్ధపడుతుండగా ఒక్క ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాల నుంచే 600 దరఖాస్తులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన కాకముందు ఏపీ పొలిటికల్ నేతలంతా హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవారు ఎక్కువే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నేతలకు తెలంగాణాలో ఆస్తులు, అంతస్తులు ఉన్న విషయం తెలిసిందే.