బిజినెస్

గత నెలలో 4 శాతం పెరిగిన మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: గడచిన ఆగస్టు మాసంలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల వౌలిక విలువ రూ. 25.47 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన ఏడాది ఇదే నెలతో పోలిస్తే తాజాగా 4 శాతం వృద్ధి నెలకొంది. ఈక్విటీ, ద్రవ్య పథకాల్లోకి అత్యధికంగా వచ్చిన నిధుల కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 44 కంపెనీలున్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ గత జూలై అంతానికి ఆస్తుల విలువ రూ. 24.53 లక్షల కోట్లుగా ఉందని ‘అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత నెలలో దేశీయ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లకు మొత్తం రూ.1.02 లక్షల కోట్ల నిధులు వచ్చాయి. గడచిన జూలైలో వచ్చిన రూ. 87 వేల కోట్లకంటే తాజా నిధుల రాబడి బాగా అధికం. ఇందులోద్రవ్య నిధుల్లోకే ఆగస్టులో రూ. 79 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి.