బిజినెస్

రిలయన్స్ సరికొత్త ఆఫర్ ‘సప్లై ఆర్ పే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: గతంలో ప్రకటించిన మేరకు క్షేత్రానుంచి ఉత్పత్తి లక్ష్యాల సాధనలో వెనుకబడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సహజ వాయు ఉత్పత్తికి సంబంధించి కొత్తగా ‘సఫ్లై ఆర్ పే’ ఆఫర్ చేస్తోంది. 2020 సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఈ సంస్ధ కొత్త క్షేత్రాల ద్వారా చేపట్టదలచిన ఉత్పత్తి నిర్వహణ నిమిత్తం ఈ ఆఫర్‌ను ప్రకటించడం జరిగింది. ఈమేరకు ఒకవేళ లక్ష్యం మేరకు ఉత్పత్తి చేసి సరఫరా చేయలేకపోతే ఒప్పందం కుదుర్చుకున్న కొనుగోలుదారుడికి అందుకు సంబంధించిన చెల్లింపులు చేస్తామని ఈ ఆఫర్‌లో రిలయన్స్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోబాటు దాని భాగస్వామి భారత్ పెట్రోలియంకు సంబంధించిన ఇంగ్లండ్ విభాగం ఈ మేరకు ‘నోటీస్ ఇన్వైటింగ్ ఆఫర్’ (ఎన్‌ఐఓ)ను విడుదల చేశాయి. బంగాళాఖాతంలోని కేజీ-డీ6 బ్లాక్‌లోగల ఆర్-సిరీస్‌లోని సహజవాయు క్షేత్రాల నుంచి ఉత్పత్తులు చేసి సరఫరా చేసేందుకు ఈ ఎన్‌ఐఓను విడుదల చేశాయి. ఇలా ఒప్పందం మేరకు సరఫరా చేయలేని పక్షంలోప్రత్యామ్నాయ ఇంధన కొనుగోలుకు సొమ్ము చెల్లించే నిబంధన విధించడం ఇదే ప్రప్రథమని గ్యాస్ విక్రయ, కొనుగోలు ఒప్పందం (జీఎస్‌పీఏ) మేరకు తెలుస్తోంది. గతంలో కేజీ-డీ6 బ్లాక్‌లో ధీరూబాయ్-1, 3, ఎంఏ క్షేత్రాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 60 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ప్రతి రోజూ ఉత్పత్తిచేసి సరఫరా చేసేలా ఎరువులు, విద్యుత్ తదితర వినియోగదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గడచిన రెండేళ్లలో ఒప్పందం మేరకు గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాల సాధనలో రిలయన్స్ వెనుకబడుతోంది. ప్రస్తుతం ఉత్పత్తి కేవలం 1.3 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. గత ఎంఏ క్షేత్రంలో ఉత్పత్తి ఆగిపోయింది. కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్-క్లస్టర్, శాటిలైట్, ఎంజే క్షేత్రాల్లో మూడు సెట్లలో గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. ఈ క్రమంలో సరికొత్త ఆఫర్‌కు ఆ సంస్థ తెరలేపింది.