బిజినెస్

రేపో రేట్ల కోతలతోనే ఆర్థికాభివృద్ధి జరగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 16: ద్రవ్య వినిమయ విధానాన్ని సరళీకృతం చేయడంతోనే ప్రస్తుతం నెలకొన్న మాంద్యం సమసిపోదని, దీనితోబాటే ప్రభు త్వం దేశంలో డిమాండ్ పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సోమవారం నాడిక్కడ విడుదలైన ఎస్‌బీఐ ఆర్థిక నిపుణుల నివేదిక పేర్కొంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి కల్పన పథకం అమలును పటిష్టవంతం చేయాలని నివేదిక సూచించింది. వృద్ధిరేటుకు ఊతమిచ్చేలా అనేక చర్యలు చేపట్టి నిధులు కేటాయిస్తోందని, ఈక్రమంలో కేవలం ఆర్బీఐ రెపోరేట్ల కోతతోనే ఆర్ధికాభివృద్ధి చోటుచేసుకోదని, గ్రామాల్లో డిమాండ్ పెరిగేలా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, పీఎం కిసాన్ వంటి పథకాలకు మరింత ఆర్థిక ఊతాన్నిచ్చి అమలు చేయాలని నివేదిక సూచించింది. ఉదాహరణకు పీఎం కిసాన్ ద్వారా 14.6 కోట్ల మందికి లబ్ధిచేకూర్చాలన్న లక్ష్యం ఉన్నా కేవలం 6.89 కోట్లమందికే లబ్ధి చేకూరిందని ఆ నివేదిక తెలిపింది. ఈపథకాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేయాల్సివుందని సూచించింది. అలాగే ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం కేంద్రం ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.45,903 కోట్లు విడుదల చేయగా రూ. 33,420 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని నివేదిక తెలిపింది.