బిజినెస్

ఐటి పరిశ్రమకు భారీగా రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ పరిశ్రమలకు భారీగా రాయితీలు ప్రకటించడంతో ప్రముఖ దేశీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఈ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల విషయంలో ఎపి ముందున్న విషయం తెలిసిందే. దానికి తోడు ఐటి పరిశ్రమకి కావలసిన మానవ వనరుల (ఐటి నిపుణులు)కు ఇక్కడ కొదవ లేదు. వౌలిక సదుపాయాలు, తగిన ప్రోత్సాహకాలతో గుడ్ గవర్నెన్స్ అందించే విధంగా ప్రభుత్వం సమర్థవంతమైన ఐటి పాలసీని రూపొందించింది. దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ఐటి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని సౌకర్యాలు రాష్ట్రంలో ఉన్నాయి.
రాష్ట్రంలో 200 ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు ఐటి, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్‌తో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆధునిక సాంకేతిక అంశాలతో కూడిన ఉన్నత విద్యతోపాటు ఈ పరిశ్రమకు కావలసిన ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడింది. దీనికితోడు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలతో కూడిన ఐటీ పాలసీ 2014-2020ని చంద్రబాబు సర్కారు ప్రకటించింది.
టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐటి పరిశ్రమకు ఉపయోగపడేలా సిలబస్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సలహా ఇచ్చింది. ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారయ్యే విధంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టమని సూచించింది. గుర్తించిన ఆన్‌లైన్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు క్రెడిట్స్ కూడా ఇవ్వమని కోరింది. తగిన ఫ్యాకల్టీని సమకూర్చుకోడానికి ప్రత్యే క కార్యక్రమాలు చేపట్టాలని చెప్పింది. విదేశీ విశ్వ విద్యాలయాలు, బడా ఐటి సంస్థల సహకారంతో ప్రారంభించే ఇనిస్టిట్యూట్స్‌కు ప్రభుత్వం తగిన సహకారం కూడా అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కం ప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివే విద్యార్థులకు నాల్గవ సంవత్సరంలో సంబంధిత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో పరిశ్రమల సహకారం తీసుకోవాలని సూచన చేసింది.
ఐటి పరిశ్రమ రాష్ట్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ప్రభుత్వం అనేక మినహాయింపులు కూడా ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశ్రమకు ఎపి కాలుష్య నియంత్రణ చట్ట పరిధి నుంచి మినహాయించారు. ఈ పరిశ్రమను ఫ్యాక్టరీస్, మెటర్నిటీ, ఏపి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్, కాంట్రాక్ట్ లేబర్, పేమెంట్ ఆఫ్ వేజెస్, మినిమమ్ వేజెస్, ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజెస్ చట్టాల నుంచి మినహాయించారు. ఐటీ యూనిట్లు సూచించిన ఫార్మాట్‌లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
మహిళా ఉద్యోగుల భద్రతకు, రక్షణకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని నైట్‌షిప్ట్‌తోపాటు మూడు షిఫ్ట్‌లలో పని చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. ఐటి, ఐటి అనుబంధ రంగాల యూనిట్లను, సంస్థలను, ప్రమాదకరం కాని హార్డ్‌వేర్ ఉత్పత్తి యూనిట్లను ఏపి ఎసెన్సియల్ సర్వీసెస్ మెయింట్‌నెన్స్ యాక్ట్ కింద తప్పనిసరి సర్వీసులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఐటి పరిశ్రమకు సంబంధించి అన్ని రకాల మొదటి సేల్ డీడ్‌లు, లీజ్ డీడ్‌లకు చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ వంద శాతం రీయంబర్స్‌మెంట్ ఉంటుంది. రెండోసారి అయితే 50 శాతం రీయంబర్స్‌మెంట్ ఉంటుంది. ఎంఎస్‌ఎంఇ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ లు) కింద స్థాపించే ఐటి యూనిట్స్‌కు విద్యుత్ బిల్లు చెల్లింపులో 25 శాతం రాయతీ ఉంటుంది.
యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాలుగానీ, వ్యాపారం విలువ రూ. 30 లక్షలు దాటినాగాని ఏది ముందైతే అప్పటివరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే ఐటి యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఐదు సంవత్సరాల వరకు గానీ లేదా రూ. 50 లక్షల వరకు గానీ ఏది ముందైతే అప్పటి వరకు వర్తిస్తుంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇండస్ట్రియల్ టారిఫ్ నుంచి కూడా కొత్త ఐటి, ఐటి అనుబంధ యూనిట్లకు 5 సంవత్సరాల వరకు వంద శాతం మినహాయింపు ఇస్తారు. ఐటి సంస్థ ప్రధాన కార్యాలయం ఎపిలో ఉంటే ఆ సంస్థ పేటెంట్ (మేధోసంపత్తి హక్కు) కోసం ఖర్చు చేసే మొత్తాన్ని రీయంబర్స్ చేస్తారు. అయితే దేశీయంగా రూ. 5 లక్షల వరకు, అంతర్జాతీయంగా రూ. 10 లక్షల వరకు పరిమితి విధించారు. ఇక ఐటి పరిశ్రమలో భారీ మెగా ప్రాజెక్టుకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా పెట్టుబడి పెట్టి, ఐదు సంవత్సరాల్లోపు ఐదు వేల మందికి ఉపాధి కల్పించేవారికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారు. పరిశ్రమ పెట్టడానికి స్థలాన్ని లేక భవనాన్ని లీజుకు లేక అద్దెకు తీసుకుంటే కొన్ని నిబంధనలకు లోబడి మూడు సంవత్సరాలపాటు అద్దె రాయతీ ఇస్తారు. అలాగే మెగా ఐటి ప్రాజెక్టులకు పది శాతం ఇన్‌వెస్ట్‌మెంట్ సబ్సిడీ కూడా అందిస్తారు. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఐటి వెలుగుల కోసం బాబు సర్కారు పక్కాగా ముందుకెళ్తోంది.