బిజినెస్

గనుల పరిశ్రమకు పన్ను భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో గనుల పరిశ్రమ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న పరిశ్రమల జాబితాలోనే ఉందని సంబంధిత పారిశ్రామికవేత్తల సంఘం ఎఫ్‌ఐఎంఐ సోమవారం నాడిక్కడ ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం వివిధ కార్పొరేట్ కంపెనీల పన్నుల్లో కోత విధించిన క్రమంలో ఎఫ్‌ఐఎంఐ ఆవేదన ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పన్ను విధింపువిధానాన్ని హేతుబద్ధీకరించాలని ఎఫ్‌ఐఎంఐ ఉపాధ్యక్షుడు రాజీబ్ లోచన్ మొహంతి కోరారు. అలా చేయడం వల్ల కింది స్థాయి నుంచి గనుల పరిశ్రమ స్థిరంగా వృద్ధిచెంది దీర్ఘకాలిక ప్రయోజనాలను సంతరించుకుంటుందన్నారు.
ప్రస్తుతం మనదేశంలో ఉన్న గనులకు కార్పొరేట్ పన్ను, జిల్లా ఖనిజ నిధి, జాతీయ ఖనిజ తవ్వకాల ట్రస్టు చెల్లింపులతో కలుపుకుని 58 శాతం, కొత్తగా ఏర్పాటయ్యే గనులకు 54 శాతం వంతున పన్నురేటు ఉందని ఆయన వివరించారు. ఇలా అన్ని రకాల లెవీలు, చెల్లింపుల వల్ల స్థానికంగా పరికరాలు, ఇతర మెటీరియల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. దీనివల్ల దిగుమతి సుంకాల భారంతో స్థూల దేశాభివృద్ధికి సైతం విఘాతం కలుగుతుందని మొహంతి తెలిపారు.