బిజినెస్

స్టాక్ మార్కెట్లలో కొనసాగిన భారీ లాభాల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 23: కేంద్ర ప్రభుత్వం మాంద్యానికి మందుగా నాలుగో దఫా ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా విధించిన పన్నుల కోత దేశీయ మార్కెట్లకు అద్భుత బలాన్నిస్తోంది. గత శుక్రవారం లాభాల కుంభవృష్టిని కురిపించిన స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండోరోజైన సోమవారం సైతం భారీ లాభాల ర్యాలీ చోటుచేసుకుంది. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఏకంగా 1,075 పాయింట్లు ఎగబాకంది. ఇక నిఫ్టీ 326 పాయింట్లు ఆధిక్యతను సాధించి 2.89 శాతం లాభాలతో రెండు నెలల గరిష్ట స్థాయి 11,600.20 పాయింట్లకు చేరుకుంది. ఈ సూచీ పరిధిలోని 32 కంపెనీలు లాభాలను గడించాయి. వాణిజ్య సమయం ముగియడానికి కేవలం 10 నిమిషాల ముందు జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో భారీగా లావాదేవీలు చోటుచేసుకుని లాభాల పంట పండిందని స్టాక్ బ్రోకర్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి 3.29 వరకు వాణిజ్యానికి అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇలావుండగా బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ సెషన్ ఆరంభం నుంచే లాభాల పరుగులు అందుకుంది. ఏకంగా 1,426 పాయింట్లు ఎగబాకింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి 1,075.41 పాయింట్ల ఆధిక్యతతో 39,090.20 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. గడచిన జూలై 17 నుంచి ఈ స్ధాయిని చూడలేదని విశే్లషకులు చెప్పారు. ఇవుండగా గడిచిన రెండు రోజుల ర్యాలీలో సెనె్సక్స్ మొత్తం 2.996.56 పాయింట్ల ఆధిక్యతతో 8.30 శాతం లాభాపడగా, నిఫ్టీ 895.40 పాయింట్లు అదనంగా సాధించి 8.36 శాతం లాభపడింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ పన్నుల కోతతో శుక్రవారం దశాబ్ధ కాలపు ఆధిక్యత 1,921.15 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 569.40 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం సెనె్సక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, మారుతి, ఎస్‌బీఐ 8.70 శాతం భారీ లాభాలను అందుకున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, టాటామోటార్స్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ అత్యధికంగా 4.97 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. బ్రాడర్ బీఎస్‌ఈ సూచీలు మిడ్‌క్యాప్ 3.08 శాతం, స్మాల్‌క్యాప్ 273 శాతం లాభపడ్డాయి. ఇక రంగాల వారీగా బీఎస్‌ఈలో కేపిటల్‌గూడ్స్ సూచీ, బ్యాంకెక్స్, పారిశ్రామిక, ఫైనాన్స్, ఎఫ్‌ఎమ్‌సీజీ, చమురు సహజవాయులు, వినిమయ వస్తువులు, స్థిరాస్తి సూచీలు 6.55 శాతం లాభపడ్డాయి. మరోవైపు బీఎస్‌ఈలో ఐటీ, టెక్, టెలికాం, వినిమయాలు, విద్యుత్ రంగాల సూచీలు 3.29 శాతం నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా యాక్సిస్ 7.3 శాతం, కోటక్ బ్యాంక్ 7.22 శాతం లాభాల పంట పండించడంతో నిఫ్టీ బ్యాంకింగ్ సూచీ 5.51 శాతం లాభపడింది. బీఎస్‌ఈలోని 972 స్టాక్స్ నష్టపోగా, 1,638 లాభపడ్డాయి. దాదాపు 103 స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయి లాభాలను అందుకున్నాయి.
స్తబ్ధుగా రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం ఎలాంటి ఎదుగూబొదుగూ లేకుండా 70.92గాట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు 0.79 శాతం తగ్గి బ్యారెల్ 63.77 డాలర్ల వం తున ట్రేడైంది. ఆసియా మార్కెట్లలో హ్యాంగ్‌సెంగ్, షాంఘై కాంపోజిట్ సూచీ లాభపడగా, నిక్కీ, కోస్పి నష్టపోయాయి. ఐరోపా స్టాక్ మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను సంతరించుకున్నాయి.