బిజినెస్

మూతపడిన థామస్‌కుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ : బ్యాంకులను మోసగించిన కేసులో చిక్కుకున్న బ్రిటన్‌కు చెందిన పర్యాటక సంస్థ థామస్‌కుక్ సోమవారం ఒక్కసారిగా మూతపడింది. దీంతోప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్ధ తో అనుసంధానమై ఉన్న సుమారు ఆరు లక్షల ‘హాలిడేమేకర్స్’ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. రెండోప్రపంచ యుద్ధం నాటినుంచి లక్షలాదిమంది విదేశీయులను స్వదేశానికి రప్పించి ఇక్కడి అందాలను ఆస్వాదించేలా చేసిన ఈ సంస్థ ప్రస్థానం ఎట్టకేలకు ముగిసింది. సుమారు 179 ఏళ్ల ఈ గ్రూప్ సంస్ధ ప్రస్తుత ఆధునీకరణ, ఆన్‌లైన్ వ్యాపారంతో పోటీపడలేక చతికలపడి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ‘బ్రెక్సిట్’ అనిశ్చితికి కారణభూతమైందన్న ఆరోపణలు సైతం ఈ సంస్థపై వచ్చాయి. బుకింగ్స్‌లో భారీ తగ్గుదల నెలకొని, ప్రైవేటు మదుపర్ల నుంచి సుమారు 200 మిలియన్ పౌండ్ల నిధులు సమీకరించాలన్న లక్ష్య సాధనలోనూ ఈ సంస్థ విఫలమైంది. దీంతో సోమవారం ఉదయం ఈ సంస్థ శాశ్వతంగా మూతపడింది. 2007లో జరిగిన విలీన ప్రక్రియ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈసంస్థతో అనుసంధానమైన సుమారు 6 లక్షల అనుబంధ సంస్థల భవితవ్యం అయోమయంగా మారింది. అలాగే థామస్‌కుక్ కంపెనీ అధికారుల కథనం మేరకు ఈ సంస్థ మూతపడటంతో పనిచేస్తున్న 22వేల మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. వీరిలో 9వేల మంది బ్రిటన్‌కు చెందినవారు. ఇటీవల బ్రిటీష్ ప్రభుత్వం సుమారు 1,50,000 మంది యూకే హాలీడే మేకర్స్‌ను బల్గేరియా, క్యూబా, టర్కీ, అమెరికా వంటి దేశాల నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే లక్ష్యంతో ఓ అత్యవసర ప్రణాళికలను రూపొందించింది. ఐతే ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు విఫలం కావడంతో కంపెనీకి చెందిన వాటాదారులతోనూ, కొత్తగా ప్రతిపాదించిన ధన సహాయకులతోనూ ఒప్పందం చేసుకోలేకపోయారని అధికారులు తెలిపారు. ఈక్రమంలో ఇక ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదని కంపెనీ బోర్డు తీర్మానించిందని, అలాగే తక్షణ నిర్బంధ లిక్విడేషన్‌కు వెళ్లాలని నిర్ణయించిందని తెలిపారు. ఇలావుండగా అప్పటికే ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకున్న ఈ థామస్‌కుక్ కంపెనీ 2007లో ‘మైట్రావెల్’ కంపెనీతో విలీనం కావడం మరింతగా అప్పుల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేసిందని అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థ 10 మిలియన్ పౌండ్ల టర్నోవర్‌తో నడుస్తూ ప్రపంచ వ్యాప్తంగా 20 మిలియన్ల మంది వినియోగదారులను కలిగివుంది.