బిజినెస్

గ్రామీణుల చెంతకు ‘బ్యాంకింగ్ సేవలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 24: పట్టణాలు, మండల కేంద్రాలకు పరిమితమైన బ్యాంకింగ్ సేవలను మా రుమూల ప్రాంతాలకు విస్తరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఇంతకాలం బ్యాంకు సేవల కోసం మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు పలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో మారుమూల గ్రామాల్లో సొంత ఊళ్లోనే బ్యాంకు సేవలు పొందే అవకాశం లభించనుంది. ఇంతేకాకుండా వీటి నిర్వహణకు ఆయా గ్రామాల్లోని అర్హులైన మహిళా సం ఘాల సభ్యులను ఎంపిక చేసి బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించనున్నారు. వీటి బాధ్యతలను సైతం జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు అప్పగించనున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో బ్యాంకు సేవలు అం తగా వినియోగంలో ఉండేవి కావు. మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఆర్థిక లావాదేవీని ప్రస్తుతం బ్యాంకు ద్వారానే జరుపాల్సి వస్తోంది. దీని దృష్ట్యా ఆర్బీఐ మరో ముందడుగు వేసి పల్లెలకు బ్యాంకిం గ్ సేవలను విస్తరింప చేయాలని నిర్ణయించింది. మరో వారం రోజుల వ్యవధిలోనే బిజినెస్ కరస్పాండెంట్ల నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. సమాఖ్య సభ్యుల్లో విద్యావంతులను బి జినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తారు. బ్యాంకు సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో మాత్రమే వీ రు సేవలందించే అవకాశం ఉంటుంది. ఈ కార్యకలాపాలను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ‘సఖి’ పేరుతో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. కరస్పాండెంట్లుగా నియమితులైన మహిళలకు కేం ద్రాల నిర్వహణ కోసం సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ వం టి పరికరాల కొనుగోలుకు రూ. 50వేలు రుణాన్ని అందించటంతో పాటు నెలకు రూ. 4వేల వేతనం, కమీషన్ కూడా ఇచ్చేందుకు సంబంధిత యంత్రాం గం దృష్టి సారించింది. జిల్లాలో బ్యాంకు సేవలు, స్ర్తినిధి సీసీలు, వీఎల్‌ఈ సేవలు అందుబాటులో లేని గ్రామాలను గుర్తించి బిజినెస్ కరస్పాండెంట్ ఏజెన్సీలను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం డీఆర్‌డీఏ అధికారులు సెర్ప్ కార్యాలయానికి నివేదికను అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తే గ్రామీణుల ఆర్థిక లావాదేవీల సమస్య తీరే అవకాశం ఏర్పడుతుంది. రైతు లు పండించిన ఉత్పత్తుల నగదు లావాదేవీలు, మ హిళా సంఘాల ఆర్థిక లావాదేవీలను సొంత ఊళ్లో నే జరుపుకునే వీలుంటుంది.