బిజినెస్

పీఎంసీపై ఆర్‌బీఐ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 4: నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏలు) తక్కువగా చూపడం వంటి అనేక రెగ్యులేటరీ లొసుగులతోకూడిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)పై రిజర్వు బ్యాంకు మంగళవారం ఆంక్షల కొరడా ఝళిపించింది. సుమారు ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. ప్రధాన ఆంక్షల్లో వినియోదారులు కేవలం రూ. 1000కి మించి విత్‌డ్రా చేసుకునే వీలు లేదనే నిబంధన ఉంది. అలాగే ఆరు నెలల వరకు ఈ బ్యాంకు కొత్త రుణాలేవీ ఇవ్వడానికి వీలులేకుండా ఆర్బీఐ నిషేధం విధించింది. ఈ నగర బ్యాంకుకు దాదాపు 11వేల కోట్ల డిపాజిట్లున్నాయి. ఈక్రమంలో ప్రజల పెట్టుబడుల నుంచి కొత్త రుణాలు మంజూరు లేదా ఉన్న రుణాల రెన్యువల్, కొత్త పెట్టుబడుల సమీకరణ, ఇప్పటికే మంజూరైన రుణాలను పంపిణీ చేయడానికి, ఆస్తుల విక్రయానికి ఈ సహకార బ్యాంకుకు ఎంతమాత్రం వెసులుబాటు ఉండదు. కాగా ప్రధానంగా మొండి రుణ బకాయిలపై స్పష్టమైన వివరాలివ్వకుండా ఆ శాతాన్ని తక్కువ చేసి చూపడంతోనే ఈ సిటీ బ్యాంకుపై ఆర్బీఐ కనె్నర్ర చేసింది. ఆర్బీఐకి ఈ బ్యాంకు చూపిన మొండి రుణ బకాయిల కంటే వాస్తవానికి రెండు రెట్లు బకాయిలున్నాయని విచారణలో తేలింది. ఈ బ్యాంకు వార్షిక నివేదికలో గత మార్చి నాటికి నికర లాభం 1.20 శాతం తగ్గినట్టు రూ. 99.89 కోట్ల లాభం చేకూరినట్టు తెలిపింది.