బిజినెస్

59 నిమిషాల్లోనే రుణ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘59 నిమిషాలకే రుణం’ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మంగళవారం ఆయన ‘సిఐఐ’ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పురోగతి సాధించాలని, అదేవిధంగా ఈ విషయంలో దిగుమతులు తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అప్పుడే దేశం ఆర్థికంగా పరిపుష్టి చెందుతుందన్నారు. ఇక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పే దిశగా నిరుద్యోగ యువతను చైతన్యవంతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు. అందుకే ‘59 నిమిషాల్లోనే రుణం’ అందించే పథకాన్ని చేపట్టామని ఆయన వివరించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు రుణాల తీసుకునే విషయంలో అంతగా ఉత్సాహం చూపించడం లేదని పలు బ్యాంకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని ఆయన తెలిపారు. అయితే ఈ పథకం విషయంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులు చైతన్యవంతం కాకపోవడమే కారణమై ఉంటుందన్నారు.