బిజినెస్

సూచీల పరుగుకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : వరుసగా రెండు రోజులపాటు లాభాల వర్షం కురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల పరుగుకు మంగళవారం బ్రేక్ పడింది. మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో దశాబ్ధకాల రికార్డులు తిరగరాసిన లాభాల ర్యాలీకి విరామం ఏర్పడింది. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే సానూకూలంగా కదలాడి ఓ దశలో 39,306.37 గరిష్ట స్థాయికి చేరింది. ఐతే అనూహ్య రీతిలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీల నేల చూపులు మొదలయ్యాయి. దీంతో వాణిజ్య సమయం మగిసేసరికి స్వల్పంగా 7.11 పాయింట్లు (0.01 శాతం) మాత్రమే లాభపడిన సెనె్సక్స్ 39,097.14 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఐతే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ 50 షేర్ల సూచీ నిఫ్టీ మాత్రం 12 పాయింట్లు కోల్పోయి 0.10 శాతం స్వల్ప నష్టాలను చవిచూసింది. ఈ సూచీ 11,588.20 పాయింట్ల దిగువన స్థిరపడింది. సెనె్సక్స్ చార్ట్‌లో ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హీరోమోటోకార్ప్, ఏసియన్ పెయింట్స్, ఓఎన్‌జీసీ, టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 3.56 శాతం నష్టపోయాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, టెక్‌మహీంద్రా, టాటామోటార్స్, మారుతి, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎస్ బ్యాంక్ అత్యధికంగా 3.78 లాభాలను సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్ను కోతలు విధించడంతో భారీ స్థాయిలో బలపడిన దేశీయ స్టాక్‌మార్కెట్లలో సెనె్సక్స్ గడచిన రెండు రోజులుగా 2,996.56 పాయింట్లు, నిఫ్టీ 895.40 పాయింట్లు లాభపడ్డాయి. ఇలావుండగా మంగళవారం సూచీల పరుగుకు విరామం ఏర్పడటంతో రంగాల వారీగా బీఎస్‌ఈలో ఐటీ, టెక్, ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, విద్యుత్ సూచీలు 2.31 శాతం లాభపడ్డాయి. అలాగే బీఎస్‌ఈలో కేపిటల్ గూడ్స్, లోహ, బ్యాంకెక్స్, స్థిరాస్తి, ఫైనాన్స్, పారిశ్రామిక రంగాల సూచీలు 1.80 శాతం నష్టపోయాయి. ఇక బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ సూచీ 0.51 శాతం నష్టాలతో ముగిసింది. ఐతే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ 0.17 శాతం లాభాలను నమోదు చేసింది.
రూపాయి విలువ బలహీనం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 7 పైసలు నష్టపోయి ఇంట్రాడేలో 71.01గాట్రేడైంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.79 శాతం తగ్గాయి. బ్యారెల్ 63.77 డాలర్ల వంతున ట్రేడైంది. ఇక ఐరోపా స్టాక్ మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లలో హ్యాంగ్‌సెంగ్, షాంఘై కాంపోజిట్ సూచీ, నిక్కీ, కోస్పి లాభాలను సంతరించుకున్నాయి. ఐతే ఐరోపా, అమెరికా ఆర్థికాభివృద్ధి గణాంకాలు ఆశించిన దానికి విరుద్ధంగా ఉండటంతో డీలర్లు మాత్రం అమోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. చైనా-అమెరికా వాణిజ్య చర్చల ఫలితాల కోసం మదుపర్లు వేచిచూస్తున్నారు. తను ఈ చర్చలకు సంబంధించి పూర్తి స్థాయి ఒప్పందాలపై సంతకాలు చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన క్రమంలో ఇరు ఆగ్ర దేశాల వాణిజ్య సమస్యలకు వారాంతానికల్లా పరిష్కారం లభిస్తుందని వాణిజ్య విశే్లషకులు అంచనా వేస్తున్నారు.