బిజినెస్

తోళ్ల పరిశ్రమలో నైపుణ్యాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశంలో నైపుణ్య అభివృద్ధి పథకం కింద తోళ్ల పరిశ్రమ(లెదర్)లో 80వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. శిక్షణ పొందిన వారికి వివిధ స్థాయిల్లో ఉపాధి కల్పించినట్టు లెదర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ బుధవారం ఇక్కడ తెలిపింది. కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్(సీఎల్‌ఈ) చైర్మన్ పనరునా అఖీల్ మాట్లాడుతూ 2012లో కౌన్సిల్ ఏర్పాటయిందని చెప్పారు. అన్ని వయసుల వారికీ వివిధ విభాగాల్లో శిక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు. లెదర్, లెదర్ ప్రొడక్ట్స్, ఫుట్‌వేర్ పరిశ్రమలో నైపుణ్య అభివృద్ధి కింద వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ధి వల్ల ఉత్పత్తి, ఉత్పాదక రంగాల్లో అనూహ్యమైన పురోగతి సాధించినట్టు ఈ దిశగా కౌన్సిల్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. మొత్తంగా శిక్షణ పొందిన 80 వేల మంది లెదర్ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఈ పరిశ్రంలో లక్ష మందికి శిక్ష ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అఖీల్ వెల్లడించారు. మహిళాభ్యున్నతికి ఈ పరిశ్రమ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోందని తోళ్ల పరిశ్రమలో 30 శాతం మంది వారేనని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 5.7 బిలియన్ డాలర్ల విలువైన ఫుట్‌వేర్ ఉత్పత్తులు ఎగుమతి అయినట్టు అఖీల్ చెప్పారు. అమెరికా, ఐరోపా దేశాలకు ఎక్కువ ఎగుమతులు సాగుతున్నాయని అన్నారు. దేశ వ్యాప్తంగా లెదర్ పరిశ్రమలో 42 లక్షల మంది పనిచేస్తున్నట్టు చైర్మన్ తెలిపారు.