బిజినెస్

నేడు పట్టాలెక్కనున్న ‘ఉదయ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు ‘ఉదయ్’ గురువారం పట్టాలెక్కబోతున్నది. తొమ్మిది డబుల్ డెక్కర్ కోచ్‌లతో ఈ రైలు అధికారికంగా గురువారం ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. టిక్కెట్ ధర రూ. 535. గత రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉదయ్ ఎట్టకేలకు పట్టాలు ఎక్కబోతున్నది. వారానికి ఐదు రోజులు మాత్రమే నడుస్తుంది. ఈ రైలుకు 22701, 22702 నెంబర్లు కేటాయించారు. ప్రతి రోజు విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు విజయవాడకు చేరుతుంది. తిరిగి ఇదే రైలు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ రైలు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలు వారంలో ఆది, గురువారాలు మినహా మిగిలిన ఐదు రోజులు నడుస్తుంది. ఈ రైలులో తొమ్మిది డబుల్ డెక్కర్ కోచ్‌లు, రెండు మోటారు పవర్ కార్లు ఉంటాయి. మూడు కోచ్‌ల్లో డైనింగ్ టేబుల్ సౌకర్యం ఉంటుంది. కోచ్‌లో 104 సీట్లు చొప్పున ఉంటాయి. రాష్ట్ర రాజధానికి ఉత్తరాంధ్ర నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చి వెళ్లే వారికి ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.