బిజినెస్

‘ఏ వాణిజ్య బ్యాంకూ మూతపడదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 25: దేశంలో ఏ వాణిజ్య బ్యాంకునూ మూసివేయబోవడం లేదని రిజర్వు బ్యాంకు బుధవారం నాడిక్కడ స్పష్టం చేసింది. 9 వాణిజ్య బ్యాంకులు త్వరలో మూతపడనున్నాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్బీఐ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఖండించారు. వాస్తవానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు, మూలధనం పెంచేందుకు అవసరమైన ఆర్ధిక సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. కొన్ని సామాజిక మాధ్యమాలు పనిగట్టుకుని తప్పుడు ప్రచా రం చేయ డం దురదృష్టకరమన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు నమ్మకానికి ప్రతీకల’ని, ‘ఏ ఒక్క బ్యాంకునూ మూసివేసేది లేద’ని ఆయన వాఖ్యానించారు. బ్యాం కుల బలోపేతానికి అవసరమైన అన్ని రకాల సంస్కరణలు అమలు జరుగుతున్నాయన్నారు. అవకతవకలతో కూడిన పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ)పై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝళిపించిన క్రమంలో 9 ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన 10 బ్యాంకులను నాలుగుగా మార్చే విలీన పథకాన్ని సైతం సామాజిక మాధ్యమాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు.