బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, వాహన రంగాలు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మదుపర్లను అయోమయానికి గురిచేశాయని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఇంట్రాడేలో ఏకంగా 586 పాయింట్లు కోల్పోయింది. అయితే తర్వాత స్వల్పంగా కోలుకుని చివరికి 503.62 పాయింట్ల (1.29శాతం) నష్టంతో 38,593.52 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 148 పాయింట్లు కోల్పోయి 1.28 శాతం నష్టాలతో 11,440.20 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్‌బీఐ, టాటా మోటార్స్, మారుతి, యెస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఐటీసీ, వేదాంత, హీరోమోటోకార్ప్, టాటాస్టీల్, ఎల్ అండ్ టీ భారీగా 7.37 శాతం నష్టపోయాయి. మరోవైపుపవర్‌గ్రిడ్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఆర్‌ఐఎల్ అత్యధికంగా 4.39 శాతం లాభపడ్డాయి. కాగా లాభాల కుంభవృష్టి నుంచి ఒక్కసారిగా మంగళవారం స్వల్ప లాభ నష్టాల్లోకి జారిపోయి ఊపిరి తీసుకున్న సూచీలు సెనె్సక్స్, నిఫ్టీ బుధవారం భారీ నష్టాల్లోకి పడిపోవడం వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతోబాటు పెరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని విశే్లషకులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికాకు చెందిన డెమొక్రాట్ అగ్రనేత నాన్సీ పెలోసీ ప్రకటన కీలకంగా ప్రభావితం చేసింది. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సాధారణ అభిశంసన విచారణ జరిపిస్తామని నాన్సీ ప్రకటించారు. ట్రంప్ తన డెమొక్రాట్ ప్రత్యర్థి జోయ్ బిడెన్‌ను బాధపట్టేందుకు విదేశీ శక్తుల సహకారాన్ని తీసుకున్నారని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. అలాగే చైనాతో ఉన్న వాణిజ్య విభేధాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని, హాంగ్‌కాంగ్ తరహా ప్రజాస్వామ్యయుత జీవనాన్ని అనుసరించాల్సిన అవసరం ఏర్పడిందని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈక్రమంలో అమెరికాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో ఆసియా మార్కెట్లలో హ్యాంగ్‌సెంగ్, షాంఘై కాంపోజిట్ సూచీ, నిక్కీ, కోస్పి బుధవారం నష్టాలతో ముగిశాయి. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో 1 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఇలావుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థికాభివృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ బుధవారం మరింతగా తగ్గించింది. కేవలం 6.5 శాతంగానే ఉంటుందని అంచనావేసింది. ఇలావుండగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మరకం విలువ బుధవారం మరో 9 పైసలు తగ్గింది. ఇంట్రాడేలో 71.10గా ట్రేడైంది. అలాగే ముడిచమురు ధరలు 1.65 శాతం తగ్గి బ్యారెల్ 62.06 డాలర్ల వంతున ట్రేడైంది.