బిజినెస్

వృద్ధిరేటు సాధనే ప్రధాన సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశాన్ని అత్యున్నత ఆర్థికాభివృద్ధి వైపు నడిపించాలన్న దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ప్రధానంగా 8నుంచి 9 శాతం వృద్ధిరేటును సాధించి ఆ వృద్ధి స్థిరంగా ఉండేలా చూడటం మనదేశం ముందున్న ప్రధాన సవాలు అని ఆయన పేర్కొన్నారు. ‘భారత గనులు, భౌగోళిక, లోహ శోధనా సంస్థ’ (ఎంజీఎంఐ) ఆధ్వర్యంలో బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన ‘61వ హొల్లాండ్ స్మారకోపన్యాస కార్యక్రమంలో అమితాబ్ కాంత్ పాల్గొని ప్రసంగించారు. మన దేశ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి పడిపోయిన క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశ వృద్ధిరేటును ఏడాదికి 8 నుంచి 9 శాతానికి చేరేలా చేసి, అది అలాగే కనీసం మూడు దశాబ్థాలపాటు కొనసాగేలా చూడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగాప్రధానంగా ఇంధన రంగంలో అభివృద్ధిని పెంచాల్సివుందని సూచించారు. ఏ ప్రపంచ దేశమూ దీర్ఘకాలానికి ఇంధన అభివృద్ధిని కొనసాగించలేకపోతోందని ఆయన తెలిపారు. మన దేశం ఇప్పటికే ఈరంగంలో వివిధ దేశాలకు దీటైన పోటీని ఇస్తున్నప్పటికీ జీడీపీలోప్రతి యూనిట్ ఇంధనావసరాల రీత్యా చూస్తే ప్రపంచ సరాసరికన్నా కనిష్ట స్థాయిలోనే ఉందని ఆయన వెల్లడించారు. అందుకే ఈ రంగంలో నైపుణ్యాలను, సమర్థతను పెంచేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ప్రధాన్యతనిస్తోందని అమితాబ్‌కాంత్ తెలిపారు. 2017-18 చివరి త్రైమాసికంలో మనదేశం 8.1 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ తర్వాత ఈ ఏడాది తొలి త్రైమాసికానికల్లా ఆ వృద్ధిరేటు 5 శాతానికి పడిపోయిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అలాగే ప్రభుత్వం సైతం మాంద్యానికి మందు వేసే దిశగా అనేక ఉద్దీపన చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆర్బీఐ ఇప్పటికే ఈఏడాది రెపోరేట్లను 110 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిందన్నారు. ఇది 28 ఏళ్ల గరిష్ట స్థాయి తగ్గింపు అని ఆయన తెలిపారు. అలాగే ఇటీవల కార్పొరేట్ పన్నుల్లో 10 శాతం కోత విధించడం కీలక నిర్ణయమన్నారు. ఆరేళ్ల కనిష్ట స్థాయి వృద్ధిరేటుతో నెలకొన్న ఆర్థిక మాంద్యం, 45 ఏళ్ల గరిష్ట స్థాయి నిరుద్యోగితను అధిగమించేందుకు ఈచర్యలు దోహదం చేస్తాయని అమితాబ్ కాంత్ ఆకాంక్షించారు.
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్