బిజినెస్

మళ్లీ అధిక లాభాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులతోబాటు సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ గడువుముగిసిపోవడం వంటి కారణాలు దేశీయ మార్కెట్లకు ఊతం ఇచ్చాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఇంధన, వాహన రంగాల స్టాక్స్ బాగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30షేర్ల సూచీ సెనె్సక్స్ 392.22 పాయింట్లు ఎగబాకగా, బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 131 పాయింట్ల ఆధిక్యతను సాధించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు సానుకూలత లభించిందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. ‘చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో పురోగతి ఉంది. అనుకున్నదానికంటే ముందే అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పదం కుదిరే అవకాశం ఉంది’ అని ట్రంప్ వాఖ్యానించడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు మదుపర్లకు ఈ రెండు అగ్ర వాణిజ్య శక్తుల మధ్య నెలకొన్న వివాదం పట్ల ఉన్న సందిగ్థత తొలగిపోయింది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం విధించిన కార్పొరేట్ పన్నుల కోత, ఇతర వెసులుబాట్లను సద్వినియోగం చేసుకునేందుకు దేశీయ మార్కెట్ల వైపుమదుపర్లు మొగ్గుచూపారు. అంతేకాక వచ్చే వారం జరుగనున్న రిజర్వు బ్యాంకు ద్రవ్య వినిమయ విధాన సమీక్ష సమావేశంపై మదుపర్లు దృష్టి సారించారు. ఇలావుండగా ఉదయం నుంచే లాభాల దిశగా కదలాడిన సెనె్సక్స్ ఏకంగా 565 పాయింట్లు ఎగబాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణలు చోటుచేసుకోవడంతో తగ్గుముఖం పట్టిన ఈ సూచీ చివరికి 396.22 పాయింట్ల ఆధిక్యతతో 1.03 శాతం లాభాలతో 38,989.74 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 131 పాయింట్లు ఎగబాకి 1.15 శాతం లాభాలతో 11,571.20 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టాటాస్టీల్, ఓఎన్‌జీసీ, మారుతి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ అత్యధికంగా 6.47 శాతం లాభపడ్డాయి. మరోవైపు యెస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్ అత్యధికంగా 4.93 శాతం నష్టపోయాయి. కాగా ఇప్పుడున్న సానుకూల పరిస్థితులకు తోడు రానున్న పండుగ సీజన్‌లో పెట్టుబడులు లాభాలు పండించవచ్చన్న అంచనాలు కూడా మదుపర్లను వాటాల కొనుగోళ్ల వైపుమళ్లించిందంటున్నారు. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో లోహ, స్థిరాస్తి, చమురు, సహజవాయువులు, వాహన, ఇంధన, వౌలిక పరికరాలు, కేపిటల్ గూడ్స్, బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు 4.20 శాతం లాభాలను నమోదు చేశాయి. ఐటీ, టెక్ సూచీలు నష్టపోయాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.92 శాతం లాభాలను సంతరించుకున్నాయి.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా దేశాల్లో అధిక శాతం స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను చవిచూశాయి. హ్యాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పి లాభాలతో ముగియగా, షాంఘై కాంపోజిట్ సూచీ మాత్రం నష్టాలను నమోదు చేసిం ది. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతోనే సాగా యి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గురువారం 8పైసలు పెరిగి ఇంట్రాడేలో 70.95గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు 0.26 శాతం పెరిగి బ్యారెల్ 62.65 డాలర్ల వంతున ట్రేడైంది.