బిజినెస్

ఎలక్ట్రిక్ అద్దె బస్సులకు ఓపెన్ టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు అద్దె బస్సులు కావాలంటూ ఆర్టీసీ ఓపెన్ టెండర్లను ఆహ్వానించింది. మొదటి దశలో కొన్ని ప్రాంతాలకు పైలట్ ప్రాజెక్టుగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ అందుకోసం కావాల్సిన బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది. దీనిలో భాగంగానే మొదటి దశలో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిన ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లను గురువారం నుండి ఆహ్వానించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్న ఈ అద్దె బస్సులకు 12 ఏళ్ల కాలపరిమితిని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది. అలాగే బస్సులు ప్రయాణించే కిలో మీటర్ల ఆధారంగా బిల్లులు చెల్లించే విధంగా విధానాలను రూపొందించింది.
రన్నింగ్ కిలో మీటర్లకు చెల్లింపులు చేసేలా ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లను ఆహ్వానించిన ఆర్టీసీ అర్హత ఉన్న కంపెనీల నుండి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. దీనికి ముందస్తు కసరత్తులో భాగంగా ప్రీ బిడ్ సమావేశాన్ని గురువారం ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్వహించారు. అక్టోబర్ 14లోగా టెక్నికల్ బిడ్లు సమర్పించాలని అధికారులు తెలిపారు. నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్ తెరిచి, నవంబర్ 6న రివర్స్ బిడ్డింగుకు ఆర్టీసీ వెళ్లనుంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ - రాజమండ్రి - అమలాపురం, గన్నవరం - హనుమాన్ జంక్షన్, విజయవాడ - గుడివాడ - భీమవరం, జగ్గయ్యపేట - మచిలీపట్నం, నూజివీడు - కోదాడ, విజయవాడ - అమరావతి, విజయవాడ - గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్ - మంగళగిరి, విశాఖ - యలమంచిలి - భీమిలీ - శ్రీకాకుళం - నర్నిపట్నం, తిరుపతి - తిరుమల ఘాట్ రూట్‌లకు సంబంధించి అద్దె ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లను ఆహ్వానించింది. ఆర్టీసీ ముఖ్యంగా విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి రీజియన్లలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఏడాదిలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర రహదారులపైకి ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా ఆర్టీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది.