బిజినెస్

వాణిజ్యంలో భారత్ అంతర్జాతీయంగా మంచి పోటీనిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: గతంలో ఎన్నడూ లేనంతగా చోటుచేసుకున్న కార్పొరేట్ పన్నుల కోత వల్ల మన దేశం వాణిజ్యపరంగా ఇతర దేశాలతో పోటీపడేలా ఎదిగేందుకు, పెట్టుబడులు పెరిగేందుకు దోహదపడుతుందని ‘ఐహెచ్‌ఎస్ మార్కిట్’ అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి ఆసియా దేశాల్లో పోటీతత్వం పెరుగుతుందని అంచనా వేసింది. గత కొన్ని త్రైమాసికాలుగా నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దేందుకు, భారత్‌ను తయారీ రంగ హబ్‌లా మర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు వీలుకలుగుతుందని ఆ నివేదిక తెలిపింది. ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దడంలో భాగంగా ఆర్బీఐ ద్రవ్య వినిమయ విధానాన్ని ఈ ఏడాది నాలుగు సార్లు సరళీకృతం చేసి 110 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్లలో కోత విధించిన విధించిన విషయాన్ని గుర్తుచేసింది. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల త్రైమాసికంలో 5 శాతంగా నమోదైన వృద్ధిరేటుతో తయారీ రంగం కుదేలైందని, ప్రధానంగా వాహనాల తయారీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, అలాగే వాహనాల విక్రయాలు సైతం 31 శాతం పడిపోయాయని తెలిపింది. అలాగే ప్యాసింజర్ వాహనాల తయారీ సైతం 17 శాతానికి పడిపోయిందని, ఈక్రమంలో ఈనెల 20న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్నుల కోతతో మనదేశం అంతర్జాతీయ పోటీని తగ్గట్టుగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందని నివేదిక తెలిపింది. మధ్య కాలికంగా కార్పొరేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని తెలిపింది. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో కార్పొరేట్ ఆదాయ పన్నుల శాతం 2000 సంవత్సరంలో 32.5 శాతంగా ఉండగా 2018 నాటికి 23.9 శాతానికి తగ్గిన విషయాన్ని నివేదిక గుర్తుచేస్తూ, వౌలిక కార్పొరేట్ పన్నును సైతం 30 నుంచి 2 శాతానికి తగ్గించినట్టు తెలిపింది. ఈఏడాది అక్టోబర్ 1వ తేదీ తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ సంస్థలకు ఒక వేళ తదుపరి రాయితీలేవీ కోరకుంటే, 2023 వరకు జరిగే ఉత్పత్తికి సంబంధించిన పెట్టుబడులపై అతి తక్కువ కార్పొరేట్ పన్ను రేటు 15 శాతమే వర్తించనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో కొత్తగా ఏర్పాటయ్యే వినిమయ వస్తువులు, కేపిటల్ గూడ్స్, ఉక్కు వంటి తయారీ పరిశ్రమలు లబ్ధ్ఫిందనున్నాయి.