బిజినెస్

మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్యవారం చివరి రోజైన శుక్రవారం మళ్లీ నష్టాల్లోకి జారాయి. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో అమెరికా-చైనా వాణిజ్య చర్చలకు విఘాతం ఏలకడంతో ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడిందని విశే్లషకుల అంచనా. ఈక్రమంలో రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు గురైన సూచీలు చివరికి నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా లోహ, వాహన, ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 167.17 పాయింట్లు కోల్పోయి 0.43 శాతం నష్టాలతో 38,822.57 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఐతే ఈ సూచీ తొలుత 325 పాయింట్లు ఎగబాకి ఇంట్రాడేలో ఒక దశలో 38,782.60 పాయింట్ల కనిష్టానికి, తర్వాత 39,107.37 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 58.80 పాయింట్లు కోల్పోయి 0.51 శాతం నష్టాలతో 11,512.40 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, టాటాస్టీల్, ఓఎన్‌జీసీ, టాటామోటార్స్, సన్‌పార్మా, ఎం అండ్ ఎం, టీసీఎస్, హీరోమోటోకార్ప్ అత్యధికంగా 5.39 శాతం నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, ఆర్‌ఐఎల్, కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ 1.61 శాతం లాభపడ్డాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన విచారణ క్రమంలో అంతర్జాతీయంగా పదుపర్లు వేచిచూసే వైఖరిని అవలంభించారని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లలో హ్యాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పి శుక్రవారం నష్టాలను నమోదు చేశాయి. షాంఘై కాంపోజిట్ సూచీ మాత్రం లాభాల్లో సాగింది. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభపడ్డాయి. మరోవైపు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు బలపడి ఇంట్రాడేలో 70.87గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు 0.33 శాతం తగ్గి బ్యారెల్ 62.55 డాలర్లు వంతున ట్రేడైంది.