బిజినెస్

ఆర్‌నామ్‌లోని 21.54 శాతం వాటా విక్రయం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: రిలయన్స్ క్యాపిటల్ తన మ్యూచువల్ ఫండ్ విభాగమయిన రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌నామ్)లోని 21.54 శాతం వాటా విక్రయాన్ని పూర్తి చేసింది. జాయింట్ వెంచర్ భాగస్వామి జపాన్‌కు చెందిన నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు రూ. 3,030 కోట్లకు 21.54 శాతం వాటాను విక్రయించినట్టు రిలయన్స్ క్యాపిటల్ ప్రకటించింది. ఆర్‌నామ్‌లో తనకు మిగి లిన రూ. 700 కోట్ల విలువ గల 4.28 శాతం వాటా ను కూడా విక్రయించనున్నట్టు రిలయన్స్ క్యాపిటల్ వెల్లడించింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఆర్థిక సేవల విభాగమే రిలయన్స్ క్యాపిటల్. గతంలో రిలయన్స్ క్యా పిటల్ ఆర్‌నామ్‌లోని తన 17.06 శాతం వాటాను మూడుసార్లు కలిపి మొత్తం రూ. 2,480 కోట్లకు విక్రయించింది. ఆర్‌నామ్‌లోని తన మొత్తం వాటా ను విక్రయించడం ద్వారా సమకూరే రూ. 6,200 కోట్లను రిలయన్స్ క్యాపిటల్ తన రుణాలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోనున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.