బిజినెస్

బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తికి అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిన కారణంగా దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో సాయంత్రం వేళల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాథ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని మహానది కోల్‌ఫీల్డ్ సిబ్బంది విధులను బహిష్కరించడం, భారీ వర్షాలు కారణంగా సింగరేణి, తేల్చేకు బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికి తీయడం సాధ్యం కావడంలేదన్నారు. దీంతో ఏపీకి అవసరమైన బొగ్గు సరఫరా కాకుండా ధర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఎదురవుతోందని తెలిపారు. రాష్ట్రంలో 1100 మెగావాట్ల విద్యుత్‌లోటు కారణంగా ఈనెల 27,28 తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ఆదివారం కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో జలవిద్యుత్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నా, గాలి మరలు, సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాయంత్రం వేళల్లో తగ్గుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పవర్ ఎక్స్ఛేంజ్ ద్వారా విద్యుత్తును కొనుగోలు చేసి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా విద్యుత్తును సరఫరా చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.