బిజినెస్

విద్యుత్ రంగానికి ఏడాదికి రూ. 2,500 కోట్ల ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం విధించిన కార్పొరేట్ పన్నుల కోత విద్యుత్ రంగాభివృద్ధికి దోహదం చేస్తుందని, అంతేకాకుండా ఏడాదికి రూ. 2,500 కోట్ల వంతున విద్యుత్ సరఫరా విభాగానికి ఆదా అవుతుందని సోమవారం నాడిక్కడ విడుదలైన ఇక్రా అధ్యయన నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ఆదాయ పన్నులో 10శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. అలాగే కొత్తగా ఏర్పాటయ్యే తయారీ సంస్ధలకు పన్నురేటును 17.01 శాతానికి పరిమితం చేసిన విషయం విధితమే. కార్పొరేట్ పన్నుల వెసులుబాటు వల్ల విద్యుత్ ఉత్పత్తిదారులకు వ్యయం అదులోకి రావడంతోబాటు విద్యుత్ కొనగోలు ఒప్పందాలు (పీపీఏలు) సక్రమంగా సాగడానికి వీలుకలుగుతుందని ఆ నివేదిక వెల్లడించింది. అంతేగాక విద్యుత్ సరఫరా విభాగాలు (డి స్కంలు) కూడా తక్కువ పన్ను సౌకర్యాన్ని పొందే అవకాశం ఉందని ఇక్రా వివరించింది. ఈలెక్కన కేంద్ర, రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక, సరఫరా విభాగాల నుంచి డిస్కంలకు సుమారు రూ. 25 బిలియన్ (2500 కోట్లు) లబ్ధి చేకూరే అవకాశాలున్నాయని ని వేదిక వివరించింది. ఇందువల్ల డిస్కంలు విద్యుత్ సరఫరాను సైతం తక్కువ ధరకే చేస్తాయని, ఈలెక్కన ప్రతి యూనిట్ విద్యుత్ సరఫరాపై 3 పైసలు తగ్గించే అవకాశాలున్నాయని కార్పొరేట్ రేటింగ్స్ సంస్థ ఇక్రా గ్రూప్ అధిపతి, సీనియర్ ఉపాధ్యక్షు డు సవ్యసాచీ ముజుందార్ తెలిపారు. ప్రతి ఏటా మనదేశంలో 1250 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. ఒక యూనిట్ అంటే ఒక కిలోవాట్ అని అర్థం. ఇందులో ఈ ఏడాది 67 శా తం ధరల తగ్గుదలతో కూడిన ఉత్పత్తులు కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్‌టీపీసీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీలు కాస్ట్ ప్లస్ టారిఫ్‌లను కలిగి డిస్కంలకు పన్ను వెసులుబాటును కల్పించే స్థితిలోకి వచ్చాయి.