బిజినెస్

తెలివి మీరిన జనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 30: దసరా పండుగ రద్దీ దృష్యా ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను 30 రూపాయలు చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని జనం తమ తెలివితేటలతో తిప్పికొడుతున్నారు. పండుగ సెలవుల్లో ఊళ్లకు వెళ్లే బంధు మిత్రులకు వీడ్కోలు చేప్పేందుకు వచ్చే వారి రద్దీని తగ్గించే ఉద్దేశంతో కొన్నిరోజుల పాటు ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను 10 రూపాయల నుంచి 30 రూపాయలకు పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జనం ప్లాట్‌ఫారం టిక్కెట్ బదులు రూ. 10 కనీస చార్జీతో ప్యాసింజర్ రైలు టికెట్ కొంటున్నారు. ప్లాట్‌ఫారం టిక్కెట్ అయితే కేవలం రెండు గంటలు మాత్రమే రైల్వే ప్రాంగణంలో ఉండేందుకు పనికొస్తుంది. అదే రూ. 10 ప్యాసింజర్ రైలు టిక్కెట్ అయితే 24 గంటల వరకు పనికొస్తుంది. పైగా స్టేషన్ నుంచి బయటకు వెళుతూ మరొకరికి ఆ టిక్కెట్ ఇచ్చి వెళ్లవచ్చు కూడా.