బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : మదుపర్లు వాటాల విక్రయాలకు దిగడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు సంబంధించి ప్రతికూల వార్తలు వెలువడడంతో ఆందోళనకు గురైన మదుపర్లు ఈ రెండు రంగాల్లో అధికంగా వాటాల విక్రయాలకు పాల్పడ్డారు. ఈక్రమంలో బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 155.24 పాయింట్లు కోల్పోయి 0.40 శాతం నష్టాలతో 38,667.33 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 37.95 పాయింట్లు కోల్పోయి 0.33 శాతం నష్టాలతో 11,474.45 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అత్యధిక నిరర్ధక ఆస్తులు కలిగివుండడంతోబాటు నిర్దేశిత మార్గదర్శకాలను అనుసరించకపోవడం వల్ల లక్ష్మీ విలాస్ బ్యాంక్‌పై రిజర్వు బ్యాంక్ ‘ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్’ (పీసీఏ) తీసుకోవడంతో ఆ బ్యాంకు వాటాలు దాదాపు 5శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్ లిమిట్‌కు చేరింది. ఇలా ఆర్బీఐ చర్యలకు గురికావడం వల్ల లక్ష్మీవిలాస్ బ్యాంకును ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌తో విలీనం చేయాలన్న ప్రతిపాదన అమలు జరుగుతుందా? అన్న అనుమానం అంతటా నెలకొంది. దీంతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాటాలు సైతం దాదాపు 30 శాతం నష్టపోయాయి. అలాగే రిలయన్స్ క్యాపిటల్ 14 శాతం నష్టపోయింది. కారణం ఈ సంస్థ ఇకపై రుణాల పంపిణీకి స్వస్తి పలకాలని నిర్ణయించడమేనని విశే్లషకులు చెబుతున్నారు. ఇటీవలే వివిధ అవకతవకల్లో కూరుకుపోయిన పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీబి) ఆర్బీఐ ఆంక్షలకు గురైన సంగతి తెలిసిందే.
ఈక్రమంలో ఇలాంటి ఇతర బ్యాంకులపైనా ఆర్బీఐ దృష్టి సారించింది. కాగా సోమవారం సెనె్సక్స్ చార్టులో యెస్ బ్యాంక్ అత్యధికంగా 16 శాతం నష్టపోయింది. అలాగే ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌పార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సైతం 6.84శాతం నష్టపోయాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా 5.2శాతం లాభపడింది. ఐటీ స్టాక్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ సైతం లాభాలతో ముగిశాయి. నెల మొత్తంలో సెనె్సక్స్ 1,334 పాయింట్లు, నిఫ్టీ 459.65 పాయింట్ల వంతున లాభాలను సంతరించుకున్నాయి. కాగా సోమవారం భారీగా వాటాల అమ్మకాలకు గురైన బ్యాంకులు, నాన్‌బ్యాంకింగ్ పైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), లోహ స్టాక్స్ తీవ్ర నష్టాల పాలయ్యాయి. ఇక బ్రాడర్ మార్కెట్‌లో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ తీవ్రంగా 1.17 శాతం నష్టపోగా, మిడ్‌క్యాప్ సూచీ 1.12 శాతం నష్టాలను సంతరించుకుంది. అలాగే బీఎస్‌ఈ లార్జ్‌క్యాప్ సైతం 0.42 శాతం నష్టాలతోనే ముగిసింది. రంగాలవారీగా బ్యాంకెక్స్ అత్యధికంగా 2.62 శాతం నష్టపోగా, ఫైనాన్స్ 2.44 శాతం, స్థిరాస్తి రంగం 1.63 శాతం నష్టపోయాయి. టెలికాం రంగం మాత్రం 4.60 శాతం లాభాలను సంతరించుకోగా, ఐటీ సూచీ 2.62 శాతం లాభపడింది. బీఎస్‌ఈలోని మొత్తం 19 రంగాల సూచీల్లో 13 నష్టపోగా, ఆరు లాభాలతో ముగిశాయి. వచ్చే శుక్రవారం జరిగే ఆర్బీఐ ద్రవ్య వినిమయ పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంపై ప్రధానంగా మదుపర్లు దృష్టి నిలిపారు.
మిశ్రమ ఫలితాల్లో ఆసియా మార్కెట్ల్లు
అమెరికా-చైనా వాణిజ్య చర్చల ఫలితాలపై ప్రధానంగా మదుపర్లు దృష్టి నిలపడంతో సోమవారం ఆసియా మార్కెట్లు మిశ్రమ పలితాలతో ముగిశాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు కోల్పోయి ఇంట్రాడేలో 70.75గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.03 శాతం తగ్గి బ్యారెల్ 60.41 డాలర్ల వంతున ట్రేడైంది.