బిజినెస్

త్వరలో ప్రత్యేక స్థిరాస్తి పెట్టుబడుల నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: స్థిరాస్తి వ్యాపార దిగ్గజం లోథాగ్రూప్ ప్రత్యేకంగా స్థిరాస్తి పెట్టుబడుల నిధి (ఆర్‌ఈఐటీ)ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే మూడేళ్ల కాలంలో ఇది కార్యరూపం దాల్చవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ రూ. 13వేల కోట్ల విలువైన వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. వీటన్నింటినీ ఆర్‌ఈఐటీ పరిధిలోకి తీసుకువచ్చి మానిటర్ చేయాలని నిర్ణయించినట్టు ఆ అధికారులు తెలిపారు. ముంబయి ప్రధాన కార్యాలయంగా నడుస్తున్న ఈ సంస్థ రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగివుంది. ఇటీవలే ఈ సంస్థ రూ. 1350 కోట్ల విలువైన కార్యాలయ ఆస్తులను విక్రయించిం ది. కాగా సుమారు రూ.13వేల కోట్ల విలువైన 7 మిలియన్ చదరపువాణిజ్య స్థలాల్లో నిర్మాణాలు సాగుతున్నట్టు కంపె నీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోథా పీటీఐకి తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టుల నిర్మాలన్నింటినీ పూర్తిచేసి, ఆ తర్వాత ప్రత్యేక రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టు’ (ఆర్‌ఈఐటీ) ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. ప్రధానంగా కంపెనీ కార్యకలాపాలను, అద్దెలను నిర్వహించేందుకు, ప్రతి వ్యక్తిగత మదుపరీ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌ఈఐటీ వల్ల వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ సంస్థకు అద్దెల ద్వారా సుమారు రూ. 1000 కోట్ల వార్షిక నిధులు సమకూరుతున్నాయి.