బిజినెస్

నేటి నుంచి 250 జిల్లాల్లో తొలివిడత బ్యాంకు రుణ మేళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: బ్యాంకులు దేశ వ్యాప్తంగా సుమారు 250 జిల్లాల్లో గురువారం నుంచి తొలివిడత రుణ మేళాలు నిర్వహించనున్నాయి. పండుగ సీజన్‌లో డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు క్రెడిట్, రీటెయిల్ ఖాతాదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలకు) ఈ సందర్భంగా రుణాలను అందజేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈనెల 3 నుంచి వరుసగా నాలుగు రోజులపాటు జరిగే ఈ రుణ మేళాల్లో ప్రధానంగా రీటెయిల్, వ్యవసాయ, వాహన, గృహ, ఎంఎస్‌ఎంఈ, విద్య రుణాలతోబాటు వివిధ రకాల వ్యక్తిగత రుణాలను సైతం అక్కడికక్కడే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కార్పొరేట్ బ్యాంక్‌లతోబాటు దాదాపు అన్ని బ్యాంకులు ఈ రుణ మేళాల కోసం సన్నద్ధం అయ్యాయి. ఇందులో ఎస్‌బీఐ లీడ్ బ్యాంకుగా 48 జిల్లాల్లో రుణమేళాలు నిర్వహిస్తుండగా, బీఓబీ 17 జిల్లాల్లో మేళాలను నిర్వహించనుంది. అలాగే ఏకకాలంలో ‘బరోడా కిసాన్ పక్వాడా’ను సైతం బీఓబీ నిర్వహించనుంది. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్ర రుణాలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని బీఓబీ బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా ఈనెల తొలివారంలో జరిగిన వార్షిక సామర్ధ్య సమీక్షలోప్రభుత్వ రంగ బ్యాంకులు 400 జిల్లాల్లో రుణాల పంపిణీకి ఓ సంయుక్త కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి. ఆ తర్వాత ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం ఈ దిశగా తమవంతు సహకారాన్ని అందజేస్తామని తెలియజేశాయి. ఇలా బ్యాంకులు తమ సేవలను ఖాతాదారుల ఇంటివద్దకే తీసుకువెళ్లే బృహత్ కార్యానికి తెరలేపాయి. అలాగే ఈ మేళాల వల్ల ఎంఎస్‌ఎంఈలు, చిన్న తరహా రీటెయిల్ వ్యాపారులకు వారి చివరి వినియోదారుడు సైతం బ్యాంక్ సేవలను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఆర్థిక మార్గదర్శకాలు, రుణ బకాయిల వసూళ్లకు సంబంధించిన విధి విధానాలు అవలంభించడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే అన్ని జిల్లాల్లో అవగాహనా శిబిరాలను సైతం నిర్వహించి ఖాతాదారులను, వినియోగదారులను చైతన్యవంతం చేయనున్నట్టు తెలిపారు. ఈవిషయంలో స్థానిక చిరు వ్యాపారుల సంఘాలు, వాణిజ్య సంస్థలు, చాంబర్ ఆఫ్ కామర్స్‌ల సహకారాన్ని సైతం తీసుకుని వ్యాపారులు, వినియోగదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, అలాగే ఈ విషయంలో ప్రభుత్వ లక్ష్యమైన డిజిటల్ ఇండియాపై సైతం ప్రధాన దృష్టిని కేంద్రీకరించినట్టు ఆ అధికారి తెలిపారు. కాగా రుణ మేళాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులతోబాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ, ఎస్‌ఐడీబీఐలతోబాటు, ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం పాలుపంచుకుంటాయి. రెండో విడత రుణ మేళా కార్యక్రమం దీపావళికి ముందు ఈనెల 21 నుంచి 25 తేదీల మధ్య జరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.