బిజినెస్

ఆడిటర్ల పైపై తనిఖీలే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 2: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ సంక్షోభానికి ఆడిటర్లే కారణమని సస్పెండైన ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జాయ్ థామస్ ఆరోపించారు. ఆడిటర్లు సమయాభావం వల్ల బ్యాంకు పుస్తకాలను పైపైన తనిఖీ చేశారని ఆయన ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కు సెప్టెంబర్ 21న రాసిన అయిదు పేజీల లేఖలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఆయన తన లేఖలో ఆడిటర్ల పేర్లు మాత్రం పేర్కొనలేదు. దేశంలోని టాప్ టెన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లలో ఒకటిగా ఉన్న పీఎంసీ బ్యాంక్‌లో జరిగిన అవకతవకలను ఒక బోర్డు సభ్యుడు బహిరంగంగా వెల్లడించిన తరువాత థామస్ ఈ లేఖ రాశారు. బ్యాంకు వాస్తవ నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏల) గణాంకాలను, దివాలా తీసిన హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాలను దాచిపెట్టడంలో కొంత మంది బోర్డు సభ్యులు సహా ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ పాత్ర ఉందని థామస్ అంగీకరించారు. పీఎంసీ మొత్తం రూ. 8,880 కోట్ల రుణాలు ఇవ్వగా, అందులో 73 శాతానికి పైగా సుమారు రూ. 6,500 కోట్లు హెచ్‌డీఐఎల్‌కే ఇచ్చినట్టు సమాచారం. ఆర్‌బీఐ పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలు విధించడానికి రెండు రోజుల ముందు రాసిన తన లేఖలో థామస్ ఆడిటర్ల పేర్లు పేర్కొనలేదు. అయితే బ్యాంకు 2018-19 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదిక ప్రకారం, బ్యాంకుకు 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి ముగ్గురు ఆడిటర్లు- లక్డావాల్ అండ్ కంపని, అశోక్ జయేష్ అండ్ అసోసియేట్స్, డీబీ కేట్కర్ అండ్ కంపనీ ఉన్నారు.
అయితే, ఒక వార్తాసంస్థ ఈ ముగ్గురికి ఈ-మెయిల్‌లో పంపించిన పలు ప్రశ్నలకు 24 గంటలు గడచిపోయినా ఎలాంటి సమాధానం రాలేదు. పీఎంసీ బ్యాంకు వృద్ధి చెందుతున్న దశలో ఉండినందువల్ల బ్యాంకు చట్టబద్ధమయిన ఆడిటర్లు లెక్కలను పైపైన తనిఖీలు చేశారని థామస్ తన లేఖలో పేర్కొన్నారు.