బిజినెస్

కావాలనే రుణాన్ని ఎగ్గొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 3: గీతాంజలీ జెమ్స్, దాని విదేశాలకు పరారైన యజమాని మెహుల్ చోక్సీ ఉద్దేశ పూర్వకంగానే రుణం చెల్లించకుండా డీఫాల్టర్లుగా మారారని ప్రభుత్వ రంగ బ్యాంకు యునైటెడ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం బహిరంగంగా ప్రకటించింది. మొత్తం రూ. 332 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. వజ్రాల వ్యాపారులు చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీలు దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో సూత్రదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. 2018 ఫిబ్రవరిలో వెలుగు చూసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో చోక్సీ, నీరవ్ మోదీ ప్రధాన నిందితులు. దక్షిణ ముంబయిలోని బ్రాడీ హౌస్ శాఖా కార్యాలయం ద్వారా హోమిమాన్ సర్కిల్‌లోగల పీఎన్‌బీలో 2011-2017 సంవత్సరాల మధ్య కాలంలో సుమారు రూ. 13వేల కోట్ల రూపాయల మేర ఈ నిందితులిద్దరూ మోసాలకు పాల్పడ్డారు. కాగా గడచిన జూన్ త్రైమాసికంలో గీతాంజలి జమ్స్, దాని యజమాని మెహుల్ చోక్సీ ఉద్దేశపూర్వక రుణ ఎగవేత దారులుగా తేలారని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఎన్ని నోటీసులు జారీ చేసినప్పటికీ రుణాలు చెల్లించడంలో చోక్సీ కంపెనీ నిర్లక్ష్యం వహించిందని తెలిపింది. ఇలావుండగా చోక్సీతోబాటు అతని భార్య ప్రీతి చోక్సీ, గీతాంజలి జమ్స్ డైరెక్టర్లకు యునైటెడ్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఈ బ్యాంకు ఆభరణాల తయారీ, ఎగుమతులు చేసే గీతాంజలి జెమ్స్ సంస్థకు మొత్తం రూ. 331.85 కోట్లు క్రెడిట్ లిమిట్ మేరకు రుణంగా మంజూరు చేసింది. ఐతే రుణం చెల్లించకపోవడంతో 2018 మార్చిలో ఆ రుణాన్ని నిరర్థక ఆస్తిగా బ్యాంకు ప్రకటించింది. ఈక్రమంలో బ్యాంకు గడచిన త్రైమాసికంలో రూ. 105 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా ఈ ఏడాది ఆరంభంలోనే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సైతం చోక్సీని, నీరవ్ మోదీని ఉద్దేశపూర్వక డీఫాల్టర్లుగా ప్రకటించడం జరిగింది.