బిజినెస్

రూ. 6వేల కోట్లు సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో దేశీయ కార్పొరేట్ సంస్థలు మొత్తం 10 ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ)ల ద్వారా రూ. 6000 (0.86 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. గడచిన ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ వచ్చే ఏడాది ప్రథమార్థానికి ఈప్రక్రియ మరింత లబ్థిని చేకూర్చే అవకాశాలున్నాయి. 3ఈవై ఇండియా ఇనిషియల్ ఆఫరింగ్స్ ట్రెండ్స్2 2019 మూడో త్రైమాసికానికి సంబంధించి గురువారం వెలువరించిన నివేదిక పై విషయాలు స్పష్టం చేసింది. భారతీయ స్టాక్ ఎక్చేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎస్‌ఎంఈ)లు ఈ ఐపీఓల విషయంలో గడచిన త్రైమాసికానికి అంతర్జాతీయంగా ఆరో ర్యాంకును సంతరించుకున్నాయి. భారతీయ కార్పొరేట్ సంస్థలు గత సంవత్సరం ఇదే కాలంలో మొత్తం 22 ఐపీఓల ద్వారా 0.87 బిలియన్ డాలర్ల మొత్తాన్ని సమీకరించినట్టు నివేదిక తెలిపింది. కాగా ఈ ఏడాది మూడోత్రైమాసికంలో ప్రధాన మార్కెట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నాలుగు ఓపీఓలను నమోదు చేశాయి. గత ఏడాది ఈ మార్కెట్లు ఇదే కాలంలో మూడు ఐపీఓలను మాత్రమే నమోదు చేయడం జరిగింది. ఎస్‌ఎంఈ మార్కెట్లలో సైతం ఇదే రకమైన ట్రెండ్ కనిపించింది. ఆ మార్కెట్లలో ఈ త్రైమాసికంలో ఆరు ఐపీఓలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆర్ధికాభివృద్ధి చర్యలు, సంస్కరణల ఫలితంగాప్రధాన మార్కెట్లలో ఈప్రగతి చోటుచేసుకుందని, థవిష్యత్తులోనూ మార్కెట్ సెంటిమెంట్‌ను, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. కాగా, రంగాల వారీగా జరిగిన విశే్లషణ మేరకు ప్రధానంగా మూడు ఐపీఓ ద్వారా వినిమయ ఉత్పత్తులు, రీటెయిల్ రంగాలు బలోపేతం అయ్యాయి.